Site icon NTV Telugu

YS Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు..? జగన్‌ సంచలన వ్యాఖ్యలు

Ys Jagan

Ys Jagan

YS Jagan: సోషల్‌ మీడియా వేదికగా మరోసారి కూటమి ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో, రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, లా అండ్‌ ఆర్డర్‌ కాపాడలేని ప‌రిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు అంటూ ప్రశ్నించారు.. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్, పొలిటికల్‌ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోంది. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు, అదీ వీలుకాకపోతే, తనవాళ్లని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారని విమర్శించారు.

Read Also: Off The Record: రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని దింపులనుకుంటున్నారా?

గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వర్రావును పట్టపగలే కొట్టి చంపేప్రయత్నంచేశారు. దీనికి సంబంధించిన వైరల్‌ అయిన వీడియో రాష్ట్రంలో మాఫియా, దుర్మార్గపు పాలనను తెలియజేస్తోంది. నాగమల్లేశ్వర్రావు కుటుంబం మొదటినుంచి వైయస్సార్‌సీపీలో ఉండడం, ప్రజల్లో వారికి మంచి గుర్తింపు ఉండడం టీడీపీ వారికి కంటగింపుగా మారింది. పలుమార్లు బెదిరించినా, భయపెట్టినా వెనకడుగు వేయకపోవడంతో, రాజకీయంగా అక్కడ, ఆ ప్రాంతంలో వైయస్సార్‌సీపీ ప్రాబల్యాన్ని తట్టుకోలేక స్థానిక ఎమ్మెల్యే తన కార్యకర్తలను పురిగొల్పి ఈ దాడులు చేయించారు. ఆ వీడియోలు చూస్తే, జరిగిన దాడి ఎంత అన్యాయమో, ఎంత హేయమో కనిపిస్తుందన్నారు జగన్‌.. సీఎం చంద్రబాబు స్వయంగా ప్రోత్సహిస్తూ, తన వాళ్లతో చేయిస్తున్న ఈ దారుణాలతో, వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో, రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు..

Read Also: Minister Nara Lokesh: ఇంటర్‌ విద్యపై లోకేష్‌ సమీక్ష.. కీలక ఆదేశాలు

ఇక, మన్నవ గ్రామ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నేత బొనిగల నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్ధితిపై ఫోన్‌లో వాకబు చేశారు వైఎస్‌ జగన్. నాగమల్లేశ్వరరావు అన్న, మాజీ ఎంపీపీ వేణుప్రసాద్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. స్ధానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే టీడీపీ మూకలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం పార్టీ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. వైఎస్సార్‌సీపీకి స్ధానికంగా బలమైన నాయకత్వాన్ని అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి పేరు తెచ్చుకున్న కుటుంబాన్ని చూసి ఓర్వలేక ఈ దారుణానికి పాల్పడడడం దారుణమన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి గ్రామంలో విచ్చలవిడిగా చేస్తున్న అక్రమాలకు నాగమల్లేశ్వరరావు అడ్డుగా ఉన్నారని ఈ దాడికి పాల్పడిన విషయం తన దృష్టికి వచ్చిందని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Exit mobile version