Site icon NTV Telugu

Big Breaking: గీత దాటిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వైసీపీ సీరియస్ యాక్షన్

Ycp 2

Ycp 2

గీత దాటిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పై వైసీపీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసింది పార్టీ అధిష్టానం. వారిని అనర్హులను చేయాలని అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్ ఆఫీసుల్లో వైసీపీ ఫిర్యాదు చేసింది. చీఫ్ విప్ ప్రసాద్ రాజు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేల శాసన సభ్యత్వాలను రద్దు చేయాలని ఫిర్యాదు చేశారు. కాగా.. అనర్హులుగా ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి పేర్లు ఉన్నాయి. ఎమ్మెల్సీలలో వంశీకృష్ణ, సి.రామచంద్రయ్య ఉన్నారు.

Avinash vs Rammohan: కేశినేని నాని ఎపిసోడులో దేవినేని అవినాష్-గద్దె రామ్మోహన్ మధ్య డైలాగ్ వార్.

కాగా.. తాజాగా ఎమ్మెల్సీ వంశీ కృష్ణ జనసేనలో చేరగా.. సి. రామచంద్రయ్య టీడీపీలో చేరారు. మరోవైపు.. గత ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాటారు. అయితే.. ఈ నలుగురిని అప్పుడే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ అధిష్టానం. తాజాగా నియోజకవర్గ ఇంఛార్జుల కసరత్తు జరుగుతుండగా.. ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రాధాన్యత సంతరించుకుంది.

Guntur Kaaram: గుంటూరు కారం సెన్సార్.. ఆ రెంటిడికి అభ్యంతరం!

Exit mobile version