Site icon NTV Telugu

CM Chandrababu: ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి అండగా ఉంటాం..

Chandrababu

Chandrababu

CM Chandrababu: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఏపీ సీఎం చంద్రబాబు కలిశారు. ఈ మేరకు ఉగ్రవాదులది పిరికిపంద చర్య, ఈ హింసను ఖండిస్తున్నామన్నారు. పహల్గామ్ బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తాం.. దేశ భద్రతను కాపాడే విషయంలో మోడీ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుంది.. ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం అండగా నిలుస్తుందని తేల్చి చెప్పారు. ఇక, ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేలా కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని ప్రధాని నరేంద్ర మోడీతో చెప్పినట్లు పేర్కొన్నారు. పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చంద్రబాబు అన్నారు.

Read Also: Tulsi Gabbard: ‘‘ఉగ్ర వేటలో భారత్‌కి అమెరికా అండ’’.. యూఎస్ స్పై చీఫ్ తులసీ గబ్బర్డ్..

ఇక, మే 2వ తేదీన చేపట్టే రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభానికి ప్రధాని మోడీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. అమరావతిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానికి వివరించాం.. దీనిపై స్పందించిన ప్రధాని, రాజధాని నిర్మాణానికి సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. అమరావతిలో పచ్చదనం పెంచేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకోసం మియావాకి విధానాన్ని అమలు చేయాలన్నారు. పనులు పున:ప్రారంభించే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధాని ఒప్పుకున్నారు.. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని, ఆర్ఐఎన్ఎల్ గురించి ప్రధానికి వివరించా.. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం ఆమోదం తెలిపినందుకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

Read Also: Minister Nimmala: ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి..

అలాగే, ఎన్‌టీపీసీ, ఆర్సెలర్ మిటల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్‌కు మద్దతు, బీపీసీఎల్ రిఫైనరీ మంజూరు విషయంలోనూ సపోర్టు ఇచ్చినందుకు ప్రధాని మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఆరామ్‌కో భాగస్వామ్యాన్ని ఖరారు చేయడంతో అదనపు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈసారి రాష్ట్ర పర్యటనలో శ్రీశైలం దేవాలయాన్న కూడా సందర్శించాలని నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

Exit mobile version