Prakash Raj Controversy: శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రకాష్‌రాజ్‌కు వీహెచ్‌పీ సీరియస్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prakash Raj Controversy: సినీ నటుడు ప్రకాష్ రాజ్.. శ్రీరాముడిపై చేసినట్లు ఆరోపిస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్ (VHP) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హిందూ సమాజానికి ప్రకాష్ రాజ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. క్షమాపణలు చెప్పకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. అమరావతిలో మీడియాతో మాట్లాడిన విశ్వహిందూ పరిషత్ భాగ్యనగర క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్యరవికుమార్… సినీ నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రకాష్ రాజ్ తన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు..
Read Also: Crude Oil and Gas Prices Drop: గుడ్‌న్యూస్.. దిగివస్తున్న చమురు ధరలు.. తగ్గుతున్న గ్యాస్ రేట్లు!
Also Read
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
- Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు ఆయుర్వేద థెరపీ.. రేపు కేరళకు డిప్యూటీ సీఎం
- Gadikota Srikanth Reddy: అన్ని ప్రాంతాల్లో కరువు జాడ..! ముందుచూపుతో వ్యవహరించండి-గడికోట శ్రీకాంత్ రెడ్డి
ప్రకాష్ రాజ్ జాతీయతకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, దేశ భావజాలాన్ని అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు సత్యరవకుమార్.. ఆయన ప్రవర్తన హిందూ సమాజాన్ని కించపరిచేలా ఉందని అన్నారు. శ్రీరాముడిని అవమానించినందుకు హిందువులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వీహెచ్‌పీ స్పష్టం చేసింది. లేనిపక్షంలో Bajrang Dal ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది. ప్రకాష్ రాజ్‌పై హిందూ సమాజం మొత్తం కలిసి క్రిమినల్ కేసులు వేస్తామని, ఆయన సినిమాలను బహిష్కరించాలని కూడా పిలుపునిచ్చారు. దర్శకులు, నిర్మాతలు, ఇతర హీరోలు తమ సినిమాల్లో ప్రకాష్ రాజ్‌కు అవకాశాలు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రకాష్ రాజ్ నుంచి దీనిపై స్పందన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!