Vallabhaneni Vamsi Case: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. వల్లభనేని వంశీ భార్య పంకజ శ్రీ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. వల్లభనేని వంశీ అరెస్ట్ అక్రమమని పేర్కొన్న ఆమె.. వంశీని అరెస్ట్ చేసిన సమయంలో పటమట పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ను భద్రపరిచాలని పంకజ శ్రీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.. ఇక, విచారణ సందర్భంగా వల్లభనేని వంశీ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వల్లభనేని వంశీ అరెస్టుకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ భద్రపరచాలంటూ విజయవాడ పటమట పోలీసులకు వినతిపత్రం సమర్పించామని హైకోర్టుకు వివరించారు.. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పటమట పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్ ను భద్రపరచాలని పోలీసులను కోరాం.. కానీ, పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు వంశీ తరఫున న్యాయవాది.. అయితే, పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు కొంత సమయం కావాలని హైకోర్టును కోరారు ప్రభుత్వం తరఫున న్యాయవాది.. దీంతో, తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.
Read Also: Minister Seethakka: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో మంత్రి సీతక్క హాట్ కామెంట్స్..
