Site icon NTV Telugu

Vallabhaneni Vamsi: మరోసారి హైకోర్టును ఆశ్రయించిన వల్లభనేని వంశీ.. సడలింపు ఇవ్వండి..!

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi: మరోసారి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. బెదిరింపులు, కిడ్నాప్‌ కేసులో అరస్ట్‌ అయిన వంశీపై ఆ తర్వాత వరుసగా 11 కేసులు నమోదు అయ్యాయి.. కొన్ని కేసుల్లో బెయిల్‌.. మరికొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్‌ రావడంతో.. 137 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు.. అయితే, 2 కేసుల్లో వంశీకి ముందస్తు బెయిల్ ఇచ్చింది హైకోర్టు.. ముందస్తు బెయిల్ ఇచ్చే సందర్భంలో విధించిన షరతుల్లో సడలింపు ఇవ్వాలని ఈ సారి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు వంశీ.. ఇక, వల్లభనేని వంశీ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టనుంది న్యాయస్థానం.. ఇప్పటికే 3 కేసుల్లో బెయిల్ సందర్భంగా విధించిన షరతులు సడలించాలని దిగువ కోర్టులో పిటిషన్ వేశారు.. ఈ పిటిషన్ల మీద విచారణ ఈ నెల 29కి వాయిదా పడిన విషయం విదితమే..

Read Also: Amazon Great Sale: అమెజాన్‌ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్‌ సేల్‌.. ఆగస్టు 1 నుంచి భారీ డిస్కౌంట్లు!

Exit mobile version