Unseasonal Rains Damage: అకాల వర్షాలతో భారీ నష్టం.. ఆరు జిల్లాల్లోని 16 మండలాలపై అధిక ప్రభావం
- రాష్ట్రంలో అకాల వర్షాలతో 1,215 హెక్టార్లలో పంట నష్టం..
- ఆరు జిల్లాల్లోని 16 మండలాలపై అధిక ప్రభావం..
- దెబ్బతిన్న మరో 267 హెక్టార్లలోని ఉద్యాన పంటలు..
- వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..
- ప్రాథమిక అంచనాలు వెల్లడించిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Unseasonal Rains Damage: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానలతో వ్యవసాయ పంటలకు జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు గాలివానలు, వర్షాలు, వడగళ్ల కారణంగా దెబ్బతిన్న పంట నష్టం వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కృష్ణా, నెల్లూరు, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించి 16 మండలాల్లోని 89 గ్రామాల్లో పంటలు వర్షాలతో దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమిక అంచనాలను ముఖ్యమంత్రికి వివరించారు. 384 హెక్టార్లలో వరి, 630 హెక్టార్లలో మొక్కజొన్న, 200 హెక్టార్లలో మినుము వంటి పంటలకు నష్టం వాటిల్లినట్టు తెలిపారు.
Read Also: HDFC Bank: 9% పతనం.. HDFC బ్యాంక్ మార్కెట్ క్యాప్ ఒక్కసారిగా రూ.1 లక్ష కోట్లు డ్రాప్
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్‌వేవ్స్ హెచ్చరిక
- Kharif Water Release: ఖరీఫ్‌కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
మొత్తం 1,215 హెక్టార్లలో సాధారణ పంటలు దెబ్బతినగా, 2,043 మంది రైతులు నష్టపోయినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు అధికారులు… అలాగే అనంతపురం, శ్రీసత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఉద్యాన పంటలపైనా అకాల వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయని… మొత్తం 307 మంది రైతులకు చెందిన 267 హెక్టార్లలోని అరటి, బొప్పాయి, మామిడి, ఆరెంజ్ తదితర పంటలకు నష్టం వాటిల్లినట్టు ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. అయితే పూర్తిస్థాయిలో పంట నష్టం వివరాలు సేకరించాలని చెప్పారు. అలాగే వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం ఇస్తూ… అప్రమత్తం చేయాలన్నారు. తద్వారా పంట నష్టం తగ్గించగలిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.
తాజావార్తలు
-
DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
-
HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
-
AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
-
CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్‌కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
-
Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్‌లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..