Union Minister Murugan: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఢిల్లీ వేదికగా చేసిన ధర్నాపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి మురుగన్.. ఏపీ పర్యటనలో ఉన్న ఆయన.. ఎన్డీఏ గెలుపును వైఎస్ జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు అని మండిపడ్డారు.. ఎన్డీఏ గెలుపును తట్టుకోలేక ఢిల్లీకి వచ్చి జగన్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.. డ్రామాలు ఆడుతున్న జగన్‌కు ఇండియా కూటమి పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయని దుయ్యబట్టారు.. ఇక, నిబంధనల ప్రకారం చూస్తే వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదా రాదు… నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదాకు అర్హత లేకుంటే ఎలా వస్తుంది..? అని ప్రశ్నించారు..
Read Also: Tihar Jail: తీహార్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. ఇద్దరికి గాయాలు..!
మరోవైపు.. నీట్ పరీక్షలను వద్దని తమిళనాడు ప్రభుత్వం అనడం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడమే అన్నారు మురుగన్.. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలు కూడా కేంద్రాన్ని వ్యతిరేకించడం కోసమే నీట్ ను తప్పు పడుతున్నాయన్న ఆయన.. నీతిఆయోగ్ సమావేశానికి స్టాలిన్ ఎందుకు వెళ్లలేదు..? అని ప్రశ్నించారు. తమిళనాడు అభివృద్ధిని స్టాలిన్ పట్టించుకోవడం లేదు.. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లకుండా తమిళనాడు అభివృద్ధి కోసం కావాల్సిన ప్రతిపాదనలు ఎలా పెట్టగలరు..? అని మండిపడ్డారు.. కేంద్రం ప్రవేశపెట్టిన సూర్య ఘర్ పథకం కింద ఏపీకి లబ్ధి పొందవచ్చు అన్నారు.. విద్యుత్ ఛార్జీల భారం తగ్గుదలకు సూర్య ఘర్ పథకం ఉపకరిస్తుందన్న ఆయన.. రైల్వేల ద్వారా రూ. 9151 కోట్లు ఏపీకి రానున్నాయి. ఏపీలో 41 రైల్వే ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి అన్నారు.. కేంద్ర, రాష్ట్రాల్లో మోడీ, చంద్రబాబు, పవన్ నేతృత్వంలో అద్భుతమైన విజయం సాధించాం. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పడిన బడ్జెట్ రూపకల్పన చేశాం. 2047లో భారత్ గ్లోబల్ లీడరుగా అవతరించేలా మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.. బడ్జెట్టులో ఏపీకి, అమరావతికి ప్రాధాన్యం ఇచ్చాం. ఏపీలో విదేశీ పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేంద్రం నుంచి ఏపీకి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి మురుగన్..