TTD Parakamani Case : టీటీడీ పరకామణి కేసు… టీటీడీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం..

  • టీటీడీ పరకామణి కేసులో కీలక పరిణామం..
  • సీజ్ చేసిన వివరాలు సీల్డ్ కవర్ లో హైకోర్టుకు..
  • తదుపరి విచారణ ఈనెల 27కి వాయిదా వేసిన హైకోర్టు..
  • కౌంటర్ దాఖలు చేయనందుకు టీటీడీపై న్యాయమూర్తి ఆగ్రహం..
Ap High Court

Ap High Court

TTD Parakamani Case : టీటీడీ పరకామణి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సీజ్ చేసిన వివరాలు సీల్డ్ కవర్ లో హైకోర్టు రిజిస్టర్ కి అందజేశారు సీఐడీ అధికారులు. ఇక, ఈ కేసులో తదుపరి విచారణ ఈనెల 27కి హైకోర్టు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయనందుకు టీటీడీపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటర్ వేయకుండా జాప్యం చేసినందుకు ఏపీ న్యాయవాదుల అసోసియేషన్ కి 20 వేల రూపాయలు డిపాజిట్ చేయాలని ఆదేశించారు న్యాయమూర్తి.. అంతేకాదు, టీటీడీ ఈవో నేరుగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలన్న న్యాయమూర్తి టీటీడీ తరపున న్యాయవాది కోరడంతో డిపాజిట్ చేయాలని ఆదేశించారు. గత ఏడాది సెప్టెంబర్ 19 న కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరిన టీటీడీ ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయనందుకు టీటీడీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా టీటీడీ అధికారుల తీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు.

Read Also: Minister Seethakka: తన తల్లిదండ్రుల సాక్షిగా.. హరీష్ రావుకి మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్..

×
×
Ad