AP Crime: నా కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించారు.. కాపాడండి.. హోంమంత్రికి మహిళ విజ్ఞప్తి..

Daughter Trafficking Case

Daughter Trafficking Case

AP Crime: నా కుమార్తెను కాపాడండి అంటూ ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ మంత్రి అనితకు మోరపెట్టుకున్నారు ఓ మహిళ.. రెండేళ్లుగా .. తమ కుమార్తె ను వ్యభిచార కూపం లోకి దించారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సచివాలయంలో బోరున విలపించారు. తమ కూతుర్ని కాపాడాలని హోం మంత్రి అనితను కలిశారు.. ఏపీ సచివాలయం లో హోమ్ మంత్రి అనిత ను కలసి వేడుకున్నారు తిరుపతి కి చెందిన మహిళ… స్థానిక ప్రజా ప్రతినిధులు. పోలీస్ అధికారులు. ఉన్నతాధికారులను కలిసి వేడుకన్నా.. ఎలాంటి స్పందన లేదన్నారు ఆ మహిళ.. రేపు తనను కలవాలన్నారు హోం మంత్రి అనిత.. దర్యాప్తు చేయిస్తా మని హామీ ఇచ్చారు. ఇప్పటికె హోం మంత్రిని మూడు సార్లు కలిసా న్యాయం జరగలేదని బోరున విలపించారు ఆ మహిళ.. అయితే, రేపు తనను కలవాలని హోంమంత్రి అనిత.. సదరు మహిళకు చెప్పడంతో.. రేపు ఎలా స్పందిస్తారో చూడాలి మరి..

Read Also: Huzurabad: ఆక్సిజన్ సిలిండర్‌తో వచ్చి ఓటు హక్కు వినియోగం.. ఆదర్శంగా నిలిచిన వృద్ధురాలు!