AP Semiconductor Policy: సెమీకండక్టర్ రంగంలో ఏపీ సంచలనం.. సర్కార్ కీలక నిర్ణయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Semiconductor Policy: ఆంధ్రప్రదేశ్‌ను సెమీకండక్టర్ తయారీ రంగంలో దేశంలోనే కీలక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తిరుపతిలో 5 వేల ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక సెమీకండక్టర్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సెమీకండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ 4.0 సవరణలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రపంచ స్థాయి చిప్ తయారీ సంస్థలను రాష్ట్రానికి ఆకర్షించడంతో పాటు భారీ పెట్టుబడులు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందించింది.
సిలికాన్ ఫ్యాబ్‌లకు 80 శాతం వరకు పెట్టుబడి రాయితీ
సెమీకండక్టర్ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీ పెట్టుబడి రాయితీలను ప్రకటించింది. సిలికాన్ ఫ్యాబ్‌ల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కలిపి 80 శాతం వరకు పెట్టుబడి మద్దతు అందించనుంది. అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్, ఇతర ఫ్యాబ్ పరిశ్రమలకు 70 శాతం వరకు ప్రోత్సాహకాలు కల్పించనుంది. ఉదాహరణకు రూ.1,000 కోట్ల పెట్టుబడితో సిలికాన్ చిప్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వం రూ.400 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు సమకూర్చనున్నాయి. దీంతో పెట్టుబడిదారుడి వాటా కేవలం రూ.200 కోట్లు మాత్రమే అవుతుంది.
Also Read
- Cyber Fraud: అమరావతి రాజధాని రైతులే టార్గెట్.. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కాజేస్తున్న కేటుగాళ్లు!
- Akvan Cyclone: అక్వాన్ తుఫాన్ ముప్పు.. హోంమంత్రి అనిత సమీక్ష.. అత్యవసర సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్లు..
- AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల సందడి.. తొలి విడతలో 1.18 లక్షల నామినేషన్లు.. పూర్తి లెక్కలివే..!
- Akvan Cyclone: తీవ్ర తుఫాన్‌గా బలపడిన అక్వాన్.. కోస్తాంధ్రకు గండం.. రేపు, ఎల్లుండి అత్యంత భారీ వర్షాలు
సెమీకండక్టర్ రంగంలోని ఆరు విభాగాలకు ప్రోత్సాహం
చిప్ తయారీ రంగంలో ఆరు కీలక విభాగాలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. చిప్ డిజైన్, తయారీ యంత్రాలు, ముడి పదార్థాల సరఫరా, ఫ్యాబ్‌ల ఏర్పాటు, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్, పరిశోధన వంటి రంగాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించనుంది. అలాగే ఈ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు కూడా రాయితీలు అందించనుంది. సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయనుంది. APSGIC పేరుతో అభివృద్ధి, పెట్టుబడుల సమన్వయ మండలిని ఏర్పాటు చేయనుంది. AP-SRIC ద్వారా పరిశోధన కార్యక్రమాలను ప్రోత్సహించడంతో పాటు AP-STCC ద్వారా యువతకు శిక్షణ అందించనుంది. ఈ సంస్థలు పరిశ్రమలు, పరిశోధనా కేంద్రాలు, శిక్షణ కార్యక్రమాల మధ్య సమన్వయం చేస్తాయి. సెమీకండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను తిరుపతి సెమీకండక్టర్ పార్కులో కల్పించనున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా, స్వచ్ఛమైన నీరు, క్లీన్‌రూమ్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రత్యేక పారిశ్రామిక గ్యాస్‌లు, రసాయనాల సరఫరా, వ్యర్థజలాల శుద్ధి, రవాణా సౌకర్యాలను కూడా అభివృద్ధి చేయనున్నారు.
యువతకు నెలకు రూ.10 వేల శిక్షణ భృతి
సెమీకండక్టర్ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను చేపట్టనుంది. ఇందులో శిక్షణ పొందే ఒక్కో అభ్యర్థికి ఆరు నెలలపాటు నెలకు రూ.10 వేల చొప్పున భృతి అందించనుంది. చిప్ డిజైన్, తయారీ, ప్యాకేజింగ్, టెస్టింగ్ వంటి విభాగాల్లో యువతకు శిక్షణ ఇవ్వనుంది. తద్వారా భవిష్యత్తులో ఏర్పడే సెమీకండక్టర్ పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇక, భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు పరిశ్రమల స్థాయిని బట్టి ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీలను ప్రకటించింది. రూ.1,000 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు మెగా ప్రాజెక్టుల హోదా కల్పించనుంది. రూ.5,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే సంస్థలకు అల్ట్రా మెగా ప్రాజెక్టుల హోదా ఇవ్వనుంది. వీటికి ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు అందించనుంది.
ఐదేళ్లపాటు యూనిట్ విద్యుత్‌పై రూ.3 రాయితీ
సెమీకాన్ 2.0 పరిధిలోకి రాని అర్హత కలిగిన సెమీకండక్టర్ పరిశ్రమలకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పించనుంది. వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైన తేదీ నుంచి ఐదేళ్లపాటు ప్రతి యూనిట్ విద్యుత్‌పై రూ.3 రాయితీ ఇవ్వనుంది. దీనివల్ల పరిశ్రమల నిర్వహణ వ్యయం తగ్గి పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూరనుంది. అయితే, సిలికాన్ ఫ్యాబ్‌లకు 80 శాతం వరకు, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్ పరిశ్రమలకు 70 శాతం వరకు పెట్టుబడి మద్దతు అందించడం ద్వారా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మరింత ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను ఏపీ ప్రభుత్వం అందించనుంది. తిరుపతిలో 5 వేల ఎకరాల్లో సెమీకండక్టర్ పార్క్ ఏర్పాటు, భారీ పెట్టుబడులు, యువతకు నైపుణ్య శిక్షణతో రాష్ట్రాన్ని చిప్ తయారీ రంగంలో కీలక కేంద్రంగా నిలబెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
Water Crisis: హైదరాబాద్ సిటీలో జలగండం.. అడుగంటిన భూగర్భ జలాలతో అపార్ట్మెంట్ వాసుల తిప్పలు..!
-
MS Dhoni-CSK: యజమానిగా ఎంఎస్ ధోనీ మరో కొత్త అవతారం?.. సీఎస్కేలో వాటా?
-
Chennai Protest: కోయంబత్తూర్ పేలుళ్ల దోషులతో సహా 22 మంది ముస్లిం ఖైదీల విడుదలకు డిమాండ్.. చెన్నైలో భారీ నిరసన..
-
AP Semiconductor Policy: సెమీకండక్టర్ రంగంలో ఏపీ సంచలనం.. సర్కార్ కీలక నిర్ణయం..!
-
ASEAN Summit: మోదీ ప్రయాణించిన ఆటో పాకిస్థాన్‌దా? వైరల్ ప్రచారంలో నిజమెంత.?
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..