సచివాలయంలో మున్సిపల్ కార్మికులతో జీవోఎం చర్చలు ముగిసాయి. కార్మిక సంఘాల డిమాండ్ల పై మంత్రి బొత్స, సజ్జల, అధికారులు విడిగా చర్చించారు. కనీస వేతనం 21 వేల కంటే అదనంగా మరో మూడు వేలు అయినా పెంచాలని మున్సిపల్ కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. అంతేకాకుండా.. గ్రాట్యుటీ ఇవ్వాల్సిందేనని మున్సిపల్ కార్మిక సంఘాలు కోరారు. అయితే.. జీతాలు 24 వేలు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో మరోసారి చర్చలు విఫలమయ్యాయి. కాగా.. సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు.
Minister Seediri: 14 ఏళ్ళు సీఎంగా ఉండి కొత్తగా ఒక్క పోర్టుకు నిర్మాణం చేయలేదు..
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. కాల్వలు, బాత్రూం క్లీనర్స్, సేవరేజ్, గార్బేజ్ సిబ్బంది, మలేరియా వర్కర్స్ వంటి 10 క్యాటగిరీల వారికి 21 వేల కనీస వేతనం ఇస్తామన్నారు. ప్రస్తుతం ఇస్తున్న 15 వేలు, అలవెన్స్ స్థానంలో మొత్తం జీతంగా పరిగణించాలి అని అడిగారన్నారు. వాటికి అంగీకరించినట్లు మంత్రి తెలిపారు. మరోవైపు.. నాన్ పీహెచ్ వర్కర్లకు సంబంధించిన క్యాటగిరీల సమస్యలు అన్నింటినీ వారం, పది రోజుల్లో పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చామన్నారు. యాక్సిడెంటల్ డెత్స్ విషయంలో నష్ట పరిహారం ఐదు నుంచి ఏడు లక్షలకు పెంచటానికి అంగీకరించామని మంత్రి తెలిపారు.
Ram Temple Inauguration: జైళ్లలో రామ మందిర ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం..
మూడు నెలల్లో నష్టం పరిహారాన్ని క్లెయిమ్ చేసుకోని వారికి వన్ టైం సెటిల్మెంట్ కింద అవకాశం ఇవ్వటానికి అంగీకరించామని పేర్కొన్నారు. రిటైర్ అయిన తరువాత వన్ టైం సెటిల్మెంట్ గా 50 వేలు ఇస్తాం అని హామీ ఇచ్చామని తెలిపారు. కనీస సర్వీస్ 10 ఏళ్ళు ఉండాలి.. పదేళ్ళు పైన సర్వీస్ ఉన్న వారికి ఏడాదికి రెండు వేలు చొప్పున ఇస్తామన్నారు మంత్రి. రెండేళ్లలోనే జీతాలు పెంచుతారా అని మంత్రి ప్రశ్నించారు.? సమ్మె విరమించాలని కోరుతున్నాం.. ప్రభుత్వం ఐదేళ్ళ కాలానికి ఉంటుంది.. ఐదేళ్ళకు ఒకసారి జీతాలు పెంచుతారని మంత్రి అన్నారు. ప్రతి ఏటా జీతాలు పెంచుతారా అని ప్రశ్నించారు?. వచ్చే ప్రభుత్వంలో జీతాలు పెంచుతాం అని చెప్పాం.. పండుగల సమయంలో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని మంత్రి సూచించారు. సమ్మె విరమిస్తారని నమ్ముతున్నట్లు మంత్రి బొత్స పేర్కొన్నారు.
