Site icon NTV Telugu

AP Vision Document- 2047: ఏపీ విజన్ డాక్యుమెంట్ 2047పై సర్కార్‌ కసరత్తు..

Ap Vision Document

Ap Vision Document

AP Vision Document- 2047: క్రమంగా రాష్ట్ర అభివృద్ధిపై ఫోకస్‌ పెడుతోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. దాని కోసం ఓ విజన్‌తో ముందుకు సాగాలనే నిర్ణయానికి వచ్చారు.. అందులో భాగంగా ఏపీ విజన్ డాక్యుమెంట్- 2047 టార్గెట్‌గా పెట్టుకోనున్నారు.. ఇక, ఏపీ విజన్ డాక్యుమెంట్- 2047 రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.. అధికారులతో ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ సమావేశం అయ్యారు.. విజన్ డాక్యుమెంటులో పొందుపర్చాల్సిన అంశాలపై చర్చించారు.. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఏపీ విజన్ డాక్సుమెంట్ – 2047 విడుదల చేయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారని పీయూష్ ఈ సందర్భంగా వెల్లడించారు..

Read Also: Paris Olympics 2024: ఫైనల్స్ కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా..

రాష్ట్ర అవసరాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ ఉంటుందన్నారు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్.. విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు అన్ని శాఖల అధికారులు సహకరించాలని సూచించారు.. నీతి ఆయోగ్ ఇప్పటికే ముసాయిదా విజన్ డాక్యుమెంట్ ఇచ్చిందన్నారు.. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులు, పరిస్థితులు, అభివృద్దికి గల అవకాశాలను పేర్కొంటూ విజన్ డాక్యుమెంట్ రాయాలన్నారు.. ఆరోగ్యం, సంక్షేమం, ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి, పర్యావరణ సుస్థిరత, స్థిరమైన అభివృద్ది, సుపరిపాలన వంటివి విజన్ డాక్యుమెంటులో ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్.

Exit mobile version