Deputy CM Post Controversy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంత కాలంగా.. నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్ కాకరేపుతోంది.. దీనిపై స్పందించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యింది.. అత్యుత్సాహం వద్దని నేతలను వారించింది టీడీపీ అధిష్టానం.. కూటమి నేతలు మాట్లాడుకున్నాకే ఏదైనా నిర్ణయాలుంటాయని స్పష్టం చేసింది..
అయితే, గత నాగుగైదు రోజులుగా లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలనే డిమాండ్ ఏపీలో కాకరేపుతోంది.. ఈ మధ్యే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటనలో ఉన్న సమయంలో.. ఆయన ముందే.. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డి.. మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలంటూ స్టేజ్‌పైనే మాట్లాడారు.. ఆ తర్వాత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ.. టీడీపీ సభ్యత్వాలు కోటి చేయించిన ఘనత మంత్రి నారా లోకేష్‌దే అని.. టీడీపీకి భవిష్యత్తు లేదన్న వారందరికీ ‘యువగళం’తో ఆయన సమాధానం చెప్పారని.. నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరారు. దీనిపై మరికొందరు టీడీపీ నేతలు.. కీలకంగా ఉన్నవారు సైతం.. ఈ డిమాండ్ చేస్తూ వచ్చారు.. మరోవైపు.. జనసేన నుంచి దీనిపై కౌంటర్ ఎటాక్ మొదలైంది.. ముఖ్యంగా సోషల్ మీడియాలో.. లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయండి.. తప్పులేదు.. కానీ, పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటూ కామెంట్లు పెట్టసాగారు.. దీంతో, అలర్ట్ అయిన టీడీపీ అధిష్టానం.. ఇది టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికే ముప్పు ఉంటుందని భావించి.. ఈ చర్చకు పులిస్టాప్ పెట్టాలని భావంచింది.. ఈ వ్యవహారంపై ఎవరూ కామెంట్లు చేయవద్దని స్పష్టం చేసింది.. దావోస్ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ ఇష్యూకు తెరదించాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. ఈ నేపథ్యంలోనే నేతల డిమాండ్‌పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది.. అత్యుత్సాహం వద్దని నేతలను టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది..