Site icon NTV Telugu

Supreme Court: ఒక్కమాట కూడా వినకుండా చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్‌ కొట్టివేత.. సుప్రీం తీవ్ర ఆగ్రహం

Sc Babu

Sc Babu

Supreme Court: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది.. చంద్రబాబు కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. సీఐడీ నమోదు చేసిన ఏడు కేసులు.. సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు ఏపీ హైకోర్టు న్యాయవాది బి.బాలయ్య.. అయితే, బాలయ్య తరపు వాదనలు వినిపించడానికి సిద్ధమయ్యారు సీనియర్‌ న్యాయవాది మణీందర్‌ సింగ్‌.. దీంతో.. మణీందర్‌ సింగ్‌పై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు జస్టిస్ బేలా త్రివేది. ఈ పిటిషన్‌కు సంబంధించిన ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తాము అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ బాలచంద్ర వరాలే ధర్మాసనం. ఇలాంటి కేసుల్లో కూడా మీలాంటి సీనియర్లు హాజరవుతారని అసలు ఊహించలేదని సీనియర్‌ న్యాయవాది మణీందర్‌ సింగ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది ధర్మాసనం. ఒక్క మాట కూడా వినకుండానే పిటిషన్‌ డిస్మిస్‌ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.

Read Also: NTR: జూనియర్ ఎన్టీఆర్ పై హాలీవుడ్ డైరెక్టర్ సంచలన కామెంట్స్..

Exit mobile version