Free Bus Travel for Women: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటూ కర్నూలు జిల్లా పర్యటనలో క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అయితే, బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయాలి అంటే వారి దగ్గర ఎలాంటి గుర్తింపు కార్డులు ఉండాలి.. అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం సాధ్యం అవుతుందా? ఏ బస్సుల్లో ప్రయాణం చేయాలి.. ఏ బస్సులకు మినహాయింపు ఉంటుంది.. అనే విషయాలను తెలుసుకుందాం..
Read Also: Ananya Pandey : కోడి కాళ్లు అంటూ కామెంట్ చేశారు.. బాడీ షేమింగ్ పై అనన్య పాండే..
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం స్కీమ్‌పై మంత్రుల బృందాన్ని నియమించింది ఏపీ ప్రభుత్వం.. ఈ పథకం అమలుపై సాధ్యాసాధ్యాలు మంత్రుల బృందం పరిశీలించింది.. బాలికలతో సహా మహిళలకు ఉచిత ప్రజా రవాణాను అందించే కర్ణాటక శక్తి పథకం అమలును గుర్తించి, ఏపీ ప్రభుత్వం మంత్రుల బృందాన్ని (GoM) ఏర్పాటు చేసింది.. రవాణా శాఖామంత్రి చైర్మన్ గా, హోంమంత్రి, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖామంత్రి సభ్యులుగా, రవాణా శాఖ ప్రధానకార్యదర్శి కమిటీ కన్వీనర్ గా ఉన్నారు.. అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ మరియు ఫిస్కల్ పాలసీ ఇన్స్టిట్యూట్ వంటి NGOలు, విద్యాసంస్థలతో సహా స్వతంత్ర సంస్థలు నిర్వహించిన వివిధ అధ్యయనాలు, సర్వేలు నిర్వహించారు.. కర్ణాటక శక్తి పధకం అమలును పరిశీలించి ఏపీలో మరింత మెరుగైన విధంగా “మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ పథకం” అమలు చేయడానికి సూచనలు చేసింది..
Read Also: అబ్బా.. హాట్ అందాలతో కాకరేపుతున్న రుహాణి శర్మ
బెంగళూరులోని KSRTC డిపోలో నడుపుతున్న వివిధ రకాలైన బస్సులు, సంస్థ నిర్వహణ విధి విధానాలు పరిశీలించింది మంత్రుల బృందం.. శాంతి నగర్ బస్ స్టేషన్లో ప్రయాణికులతో GoM ముఖాముఖి నిర్వహించారు.. రవాణా, సంబందిత ఖర్చుల విషయంలో ఇతర కుటుంబ సభ్యులపై ఆధారపడటం తగ్గింది. విద్య, ఉపాధి, ఆరోగ్య సంరక్షణ విషయాల కొరకు ఉచిత ప్రయాణం ఏంతో ఉపయోగకరం ఉంది.. ప్రతి మహిళాకు సుమారుగా నెలకు 1,000- 2,000 వరకు ఆర్థిక వెసులుబాటు కలుగుతోంది.. అదా అయిన సొమ్ము కుటుంబ ఇతర అవసరాలకు ఉపయోగపడుతోంది లాంటి అంశాలను మంత్రుల బృందం దృష్టికి వచ్చాయి.. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేశారు.
Read Also: Donald Trump: “నాకు సరైన క్రెడిట్ ఇవ్వలేదు..” కాల్పుల విరమణపై మరోసారి స్పందించిన ట్రంప్
ఇక, మహిళలందరూ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు ID కార్డ్ మొదలైనవి, చూపించి అన్ని నాన్-ఏసీ సిటీ బస్సులు, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ సర్వీస్ లలో ఉచిత ప్రయాణం చేయవచ్చు అంటుంది మంత్రుల బృందం.. అయితే, ప్రీమియం, అంతర్రాష్ట్ర బస్సులలో ఉచిత ప్రయాణ సేవలకు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.. పీక్ అవర్స్ లో 17,000 అదనపు ట్రిప్పులను నిర్వహిస్తున్నారు.. తగిన ఆదాయం లేని అంతర్రాష్ట్ర సర్వీసులను రద్దు చేసి, అవసరమైన రూట్లలో అధిక సర్వీసులు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది మంత్రుల బృందం.. శక్తి పథకం అమలు తరువాత ఏర్పడ్డ అదనపు డిమాండ్లను తీర్చడానికి ఇప్పటివరకు 4,100 కొత్త బస్సుల కొనుగోలు చేశారని.. మొత్తం 5,000 బస్సుల కొనుగోలుకు గాను కర్ణాటక ప్రభుత్వం 1,600 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని.. 3,000 మంది డ్రైవర్లను మ్యాన్ పవర్ ఏజెన్సీ కాంట్రాక్ట్ ద్వారా నియమించిందని.. 9,000 మంది అదనపు సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టారని.. తదితర అంశాలను నివేదికలో పేర్కొంది మంత్రుల బృందం..
