Somu Veerraju: ఓటమి కారణాల పై చర్చ జరగాలని సూచించారు. పాలనలో కక్ష సాధింపులు, వ్యవహర శైలినే ప్రజలు గమనిస్తారు. ఏపీలో కూటమి ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే ఉన్నాం.. పూర్తిగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.. నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చారని వెల్లడించారు.. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిందని జగన్ మాట్లాడడం, కోడిగుడ్డుపై ఈకలు పీకటం లాంటిదే అని దుయ్యబట్టారు.. మరోవైపు, సరైన రీతిలో వైఎస్ జగన్ ప్రతిపక్ష పాత్ర నిర్వహించడం లేదని ఎద్దేవా చేశారు.. గతంలో ప్రతిపక్ష నాయకుడి హోదా లభించినా అసెంబ్లీకి హాజరు కాలేదని.. కానీ, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి హోదా కావాలని జగన్ అడగడం శోచనీయమని మండిపడ్డారు సోము వీర్రాజు.. కాగా, సంక్షేమ పథకాల అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతలు, వైసీపీ మధ్య నిత్యం మాటల యుద్ధం నడుస్తూనే ఉన్న విషయం విదితమే.
Read Also: Kunamneni Sambasiva Rao: స్థానిక సంస్థల ఎన్నికలపై కూనంనేని కీలక వ్యాఖ్యలు..