Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టుకు సిట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Krishna Lockup Death Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ మేరకు హైకోర్టు విధించిన నిబంధనలను సడలించాలని సిట్ కోరింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం, సీఐ నాగరాజును ఒక రోజు మాత్రమే కృష్ణలంకలో విచారించేందుకు అనుమతిస్తూ, మిగిలిన ఏడు రోజుల విచారణను రాజమండ్రి సెంట్రల్ జైలులోనే నిర్వహించాలని పేర్కొంది. అలాగే విచారణ మొత్తం ఆడియో, వీడియో రికార్డింగ్‌తో జరగాలని ఆదేశించింది.
అయితే ఈ పరిమితుల వల్ల కేసుకు సంబంధించిన పూర్తి వాస్తవాలను వెలికితీయడం కష్టమవుతోందని సిట్ వాదిస్తోంది. అందువల్ల సమగ్ర దర్యాప్తు కోసం హైకోర్టు విధించిన షరతులను సవరించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో దర్యాప్తు పురోగతి వివరాలతో స్టేటస్ రిపోర్ట్‌ను సీల్డ్ కవర్లో తమకు ఇవ్వాలంటూ బుధవారం రోజు సిట్‌ను ఆదేశించింది హైకోర్టు.. ఈ కేసులో తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
Also Read
- Pawan Kalyan: నేడు జనసేన కీలక సమావేశం.. నేతలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
- AP High Court: రుషికొండ భవనాల వినియోగంపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు
- Sajjala Ramakrishna Reddy: వైఎస్సార్ సంక్షేమ వారసత్వాన్ని జగన్ కొనసాగిస్తున్నారు.. మళ్లీ వైసీపీ విజయం ఖాయం..
- Minister Narayana: అమరావతి వర్సెస్ మావిగన్.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టుకు సిట్..
-
Mysa: నీటి అడుగున రష్మిక రిస్క్.. ‘మైసా’ నుంచి క్రేజీ అప్డేట్
-
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు కోసం వేచి చూస్తున్న ముగ్గురు మహిళలపై దూసుకెళ్లిన బొలెరో.!
-
WhatsApp New Feature: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక, ఎవరి బర్త్‌డేలు మిస్ కారు..!
-
The Tatas Web Series: టాటా సామ్రాజ్యం కథ వెబ్ సిరీస్‌గా.. నాలుగు తరాల చరిత్రతో ‘ది టాటాస్’
ట్రెండింగ్
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!