NTV Telugu Site icon

Waiting IPS Officers: వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు మెమో.. ఎందుకో తెలిస్తే షాకే..!

Dgp

Dgp

Waiting IPS Officers: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.. ఐఏఎస్‌, ఐపీఎస్‌లను భారీ సంఖ్యలో బదిలీ చేసింది సర్కార్‌.. ఇదే సమయంలో మరికొందరిని వెయిటింగ్‌లో పెట్టింది ప్రభుత్వం.. అయితే, వెయిటింగ్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులకు తాజాగా షాక్‌ ఇచ్చారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.. వెయిటింగ్‌లో ఉంటూ హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండని సీనియర్ ఐపీఎస్‌లకు మెమోలు జారీ చేశారు.. ప్రతీరోజు ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు డీజీపీ.. అయితే, వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు మెమో జారీ వెనుక షాకింగ్ రీజన్స్ ఉన్నాయని తెలుస్తోంది.

Read Also: Duleep Trophy 2024: అందుకే కోహ్లీ, రోహిత్ ఆడటం లేదు: జై షా

విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా వెయిటింగులో ఉన్న కొందరు ఐపీఎస్‌లు కుట్ర చేస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది.. విచారణ చేస్తున్న అధికారులను, సిబ్బందితో వెయిటింగ్‌లో ఉన్న కొందరు ఐపీఎస్‌లు మీటింగ్‌లు పెడుతున్నారని ప్రభుత్వానికి సమాచారం అందింది.. విచారణ సరిగా చేయొద్దని తూతూ మంత్రంగా ముగించాలంటూ ప్రభావితం చేస్తున్నట్టుగా డీజీపీ కార్యాలయం గుర్తించిందట.. తమ పేర్లతో పాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పెద్దల పాత్రను, ప్రమేయాన్ని తక్కువ చేసి చూపేలా కేసులను దర్యాప్తు చేయాలని.. వెయిటింగ్ లో ఉన్న కొందరు ఐపీఎస్‌లు సూచనలు చేస్తున్నట్టుగా డీజీపీ ఆఫీస్‌ దృష్టికి వచ్చింది.. వివిధ కేసుల్లో జరుగుతున్న అంతర్గత విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేసినట్టు గుర్తించారు.. అయితే, వీటిని గుర్తించిన నిఘా విభాగం.. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.. దీంతో, వెయిటింగ్‌లో ఉన్న కొందరు ఐపీఎస్ అధికారుల తీరుతో ప్రభుత్వ పెద్దలు కంగుతిన్నారట.. అయితే, కేసుల దర్యాప్తులో ఆటంకం కల్పించే ప్రయత్నాలను సీరియస్‌గా తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఈ పరిణామాలతో అప్రమత్తమై మెమోలు జారీ చేసినట్టుగా సమాచారం.