Shivraj Singh chouhan: భారతరత్న, మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహారీ వాజ్‌పేయి జయంతి వేడుకలు ఏపీలో ఘనంగా కొనసాగుతున్నాయి. రాజధాని అమరావతిలో 14 అడుగుల వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ఒకప్పటి IT మ్యాన్ నేటి AI మ్యాన్ చంద్రబాబు నాయుడు తో పాటు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మనందరీ ముఖ్య నేత అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహం ఆవిష్కరణకు సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొనటం ఆనందంగా ఉంది.. హిందీలో అమ్మనీ మా అంటారు కానీ మధ్యప్రదేశ్ లో మాత్రం మామా అంటూ రెండు సార్లు స్మరించుకుంటారని శివరాజ్ సింగ్ అన్నారు.
Read Also: DK Shivakumar: డీకే.శివకుమార్‌లో నైరాశ్యం.. కార్యకర్తగా ఉంటే బెటర్ అంటూ కామెంట్
ఇక, అటల్ బిహారీ వాజ్ పేయి గురించి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆయన ప్రసంగాలు విని ఎప్పటికైనా ఈ నవ యువకుడు దేశ ప్రధాని అవుతాడని జోస్యం చెప్పారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ తెలిపారు. పార్టీలు వస్తాయి పోతాయి కానీ దేశం ముఖ్యం, దేశ భక్తి ముఖ్యం అన్న నినాదం అటల్ జీ ది.. దేశ భద్రత విషయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీకి పూర్తి సహకారం వాజ్ పేయి అందించారు.. కానీ, నేను ఇందిరా మనవడు రాహుల్ గాంధీ మాత్రం భద్రత విషయంలో మోడీనీ ప్రశ్నిస్తూ ప్రత్యర్థి దేశాలకు మద్దతు ఇస్తున్నట్లుగా ఉంది.. మొదటిసారి ప్రధానిగా అవకాశం దక్కించుకున్న అటల్ జీ తన పదవినీ కాపాడుకునేందుకు రాజకీయ విలువల్ని వదలలేదని శివరాజ్ సింగ్ పేర్కొన్నారు.
Read Also: Eesha Movie Review: ‘ఈషా’ మూవీ రివ్యూ!
అయితే, రెండవ సారి ప్రధానిగా అటల్ జీ అవకాశం దక్కించుకున్న తర్వాత ఆయన చంద్రబాబుతో రాజకీయ సంబంధాలే కాకుండా ఆత్మీయ సంబంధం కలిగి ఉన్నాడని శివరాజ్ సింగ్ అన్నారు. అటల్ జీ- చంద్రబాబు భాగస్వామ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు పెట్టింది.. నేడు మోడీ- చంద్రబాబు నాయకత్వంలో విభజన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది అన్నారు. చంద్రబాబు NDA కన్వీనర్ కాదు విజయవంతంగా కూటమినీ నడిపిన రథ సారథి అన్నారు.
