Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy: వైసీపీ ముఖ్యనేతలతో సజ్జల టెలీకాన్ఫరెన్స్‌.. కీలక ఆదేశాలు

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన పార్టీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి.. కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఈ నెల 12వ తేదీన ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని.. ఇక, అదే రోజు వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి సూచించారు.. ఇది అన్ని వర్గాల ప్రజల పక్షాన నిలబడాల్సిన సందర్భం.. లక్షలాది మంది విద్యార్ధులు, యువతను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వంపై వారి పక్షాన శాంతియుతంగా వైసీపీ ఈ కార్యక్రమం చేపడుతోంది.. పార్టీ క్యాడర్‌ అంతా క్రియాశీలకంగా దీనిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.. టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, రీజనల్‌ కోఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, ముఖ్యనేతలకు కీలక సూచనలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి..

Read Also: Infosys: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ షాక్.. ఇకపై ఆఫీసుకు రావాల్సిందే..

లక్షలాది మంది విద్యార్ధులు, యువతను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్ ఫీజు పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అన్ని జిల్లా కేంద్రాల్లో వైసీపీ శ్రేణులు, ఆయా వర్గాల ప్రజలు సంయుక్తంగా ర్యాలీగా జిల్లా కలెక్టర్‌కు మెమోరాండంను సమర్పించాలి. మొత్తం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్పాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి.. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, రైతులకు అండగా నిలుస్తూ, ఎన్నికల తరువాత వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపట్టిన కార్యక్రమం ఇప్పటికే విజయవంతమైంది. ఆ తర్వాత విద్యుత్‌ ఛార్జీలపై చేసిన కార్యక్రమం కూడా అదే స్ధాయిలో విజయవంతం అయింది. ఈ రెండు కార్యక్రమాల ద్వారా వైసీపీ ఎంత బలంగా ఉందో, ప్రజాసమస్యలపై ఎంత దృఢంగా ఉందో వెల్లడైందన్నారు..

Read Also: Jr NTR: ‘ఎన్టీఆర్’ భయంకరమైన లుక్.. ఏందన్న ఈ దారుణం?

ఇక, ఈ నెల 12న మన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతీ చోటా ఘనంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలి, మన పార్టీపై ఉన్న ప్రజాభిమానం ఈ సందర్భంగా వెల్లడవ్వాలని సూచించారు సజ్జల.. అందుకే పార్టీ క్యాడర్‌ అంతా ఉత్సాహంగా పాల్గొని ప్రజాభిమానం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాలి, ఈ వేడుకలను అందరం విజయవంతం చేద్దాం, ఈ కార్యక్రమాన్ని ఉదయాన్నే పూర్తి చేసుకుని అనంతరం ఫీజు పోరు కార్యక్రమం నిర్వహించాలన్నారు.. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామాల నుంచి రాష్ట్రస్ధాయి వరకూ వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయాలన్నారు.. మరోవైపు, సోషల్‌ మీడియాకు సంబంధించి కొత్తగా మరికొంతమంది కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారు, వారికి అవసరమైన న్యాయసహాయం అందించేందుకు లీగల్‌ సెల్‌ సిద్ధంగా ఉందని.. ఏ సమయంలో ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే లీగల్‌ సెల్‌ను అప్రమత్తం చేసి వారికి అండగా నిలబడాలని కీలక సూచనలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి..

Exit mobile version