Sajjala Ramakrishna Reddy: 2029లో వైసీపీదే అధికారం.. భారీ మెజారిటీతో గెలుస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు కీలక దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా విభాగాన్ని గ్రామస్థాయి వరకు సంస్థాగతంగా బలోపేతం చేశామని, భవిష్యత్ ఎన్నికల్లో ఇది పార్టీకి మరింత బలంగా ఉపయోగపడుతుందని అన్నారు. పార్టీ సిద్ధాంతాలు, జగన్ సందేశాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వైసీపీకి అధికారమే లక్ష్యం కాదని, ప్రజల సంక్షేమమే పార్టీ ప్రధాన అజెండా అని సజ్జల స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధానంలో ఎలాంటి మార్పు ఉండదని అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా మారే నాయకుడు కాదని, తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే నాయకుడేనని జగన్‌ను అభివర్ణించారు.
చంద్రబాబు నాయుడు రాజకీయాలు అధికారం కోసం ఉంటే, వైసీపీ రాజకీయాలు ప్రజల కోసం ఉంటాయని సజ్జల వ్యాఖ్యానించారు. ఒకప్పుడు కొన్ని వర్గాలు మీడియాను ఉపయోగించి ప్రజల్లో భ్రమలు సృష్టించాయని, ప్రస్తుతం సోషల్ మీడియా ప్రజలతో నేరుగా మమేకమయ్యే అత్యంత ప్రభావవంతమైన వేదికగా మారిందని చెప్పారు. అయితే, 2029 అసెంబ్లీ ఎన్నికల్లో గతం కంటే మరింత భారీ మెజారిటీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే పూర్తి నమ్మకం తమకు ఉందని సజ్జల తెలిపారు. పార్టీ కార్యకర్తల త్యాగాలు, కష్టాల వల్లే వైసీపీ ఈ స్థాయిలో నిలబడగలిగిందని కొనియాడారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా జగన్ ముందుండి నాయకత్వం వహిస్తున్నారని అన్నారు.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని వెల్లడించిన సజ్జల, ఒక్క పంచాయతీని కూడా పోటీ లేకుండా వదిలే పరిస్థితి ఉండదని జగన్ స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జగన్ పర్యటనలకు ప్రజల నుంచి లభిస్తున్న విశేష స్పందనే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందనే విషయాన్ని నిరూపిస్తోందని పేర్కొన్నారు. పేదలకు ఉపయోగపడని రాజకీయాలకు జగన్ ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వరని సజ్జల అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం భారీ పరిశ్రమలు, పోర్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, కేవలం పైపై కనిపించే అభివృద్ధి (కాస్మెటిక్ డెవలప్మెంట్) వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రత్యేక సూచనలు చేసిన సజ్జల, వైఎస్ జగన్ చెప్పే అంశాలను చిన్న చిన్న వీడియోలు, క్యాప్సూల్స్ రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి సోషల్ మీడియా కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేర్చే ప్రచారకుడిగా పనిచేయాలని కోరారు. అసభ్య పోస్టులు, వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. పార్టీ కమ్యూనికేషన్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకుని ప్రతి నియోజకవర్గంలో సోషల్ మీడియా బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి..
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!