Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy: నకిలీ మద్యం కేసులో అడ్డంగా దొరికిపోయారు.. చంద్రబాబుకు భయం పట్టుకుంది..!

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy: నకిలీ మద్యం కేసులో అడ్డంగా దొరికిపోయామనే భయం చంద్రబాబుకు పట్టుకుందని వ్యాఖ్యానించారు వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశం జరిగింది.. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, పలువురు ఇతర నాయకులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైసీపీకి 18 నుంచి 20 లక్షల మంది క్రియాశీల క్షేత్రస్ధాయి నాయకత్వం ఉంది.. పార్టీ సంస్ధాగత నిర్మాణంపై జగన్‌ ఆలోచనలు, బ్లూ ప్రింట్‌ను మనం అమలు చేయాలి.. వైసీపీ అనుబంధ విభాగాలన్నీ చిత్తశుద్దిగా పనిచేయాలి.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలకు అనూహ్య స్పందన వస్తుందన్నారు.

Read Also: Teacher Eligibility Test: టెట్‌పై సుప్రీంకోర్టులో పిల్.. సీజే బెంచ్‌కు రిఫర్ చేసిన ద్విసభ్య ధర్మాసనం

ఇక, ఏపీలో నకిలీ మద్యం ఏరులై పారుతుంది.. జగన్‌ పాలనలో డెలివరీ సిస్టమ్‌, డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌లను ఏర్పాటుచేసి సంక్షేమాన్ని ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్తే.. చంద్రబాబుది రివర్స్‌ పాలన అన్నారు సజ్జల.. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను గట్టిగా ఎదుర్కోవాలి.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల ఏపీలోని అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. క్షేత్రస్ధాయిలో కూడా మన అనుబంధ విభాగాలు ఫోకస్డ్‌గా పనిచేయాలి. ప్రధానంగా 7 అనుబంధ విభాగాలు కీలకపాత్ర పోషించాలి. పార్టీ లైన్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అనుబంధ విభాగాలదే ప్రధాన పాత్ర అన్నారు.. సొసైటీకి ఎలా మంచి చేయాలని తపన పడే నాయకుడు వైఎస్‌ జగన్‌ అన్నారు సజ్జల.. మరోవైపు, నకిలీ మద్యం కేసులో అడ్డంగా దొరికిపోయామనే భయం చంద్రబాబుకు ఉంది.. కల్తీ మద్యం కోసం యాప్‌ పెట్టారంటేనే అర్థం చేసుకోవాలి అన్నారు.. రాష్ట్రమంతటా నకిలీ మద్యం ఉంది, ఎక్కడో ఒకచోట అయితే యాప్‌ పెట్టాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. అంతే కాదు బెల్ట్‌ షాపులు ఉన్నాయని ఒప్పుకున్నారని.. నకిలీ మద్యం బయటపడగానే ఒకరు ఆఫ్రికా నుంచి దిగుతారు.. అతడికి రెడ్‌ కార్పెట్‌ స్వాగతం పలుకుతారు.. జోగి రమేష్‌ మమ్మల్ని నడిపారని చెప్పిరని మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి..

Exit mobile version