Site icon NTV Telugu

SAAP chairman Ravi Naidu: మాజీ మంత్రి రోజాపై ఏపీ శాప్ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు.. ఇక జైలుకే..!

Saap Chairman Ravi Naidu

Saap Chairman Ravi Naidu

SAAP chairman Ravi Naidu: మాజీ మంత్రి ఆర్కే రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ శాప్ (ఏపీ స్పోర్ట్స్‌ అథారిటీ) ఛైర్మన్ రవినాయుడు.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. పెద్ద అవినీతి తిమింగలం మాజీ మంత్రి ఆర్కే రోజా అని ఆరోపించారు.. ఆడుదాం ఆంధ్ర పేరుతో నిలువు దోపిడీ చేశారని విమర్శించారు.. కేవలం ఎన్నికల స్టంట్స్ కోసం ప్రభుత్వ సొమ్మును దుబారాగా దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు.. రోజా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రలో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించిన ఆయన.. ఓట్ల కోసం 17 ఏళ్లు పైబడిన చిన్నారులకే అవకాశం కల్పించారని మండిపడ్డారు.. అయితే, క్రీడల్లో ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు ఒక్క చిన్న సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..

Read Also: Rahul Gandhi: అమెరికాలోనూ అదానీ అక్రమాలకు పాల్పడ్డారు..

ఇక, టూరిజం శాఖ మంత్రి అయితే రోజు తిరుమలకు వెళ్లి వందల మందికి దర్శనం చేయిస్తారా..? అని నిలదీశారు రవి నాయుడు.. ఆడుదాం ఆంధ్రలో వేల కోట్ల రూపాయలు చేతులు మారడంపై.. అదే విధంగా.. రోజా తిరుమల దర్శనాలు.. ఈ రెండు అంశాలపై సీఐడీ విచారణ జరిపిస్తాం అన్నారు.. తిన్న అవినీతి సొమ్మును కక్కిస్తాం.. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.. అంతేకాదు.. రోజాను కచ్చితంగా జైలుకు పంపిస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ శాప్ (ఏపీ స్పోర్ట్స్‌ అథారిటీ) ఛైర్మన్‌ రవి నాయుడు.

Exit mobile version