RIL Invest Rs 65,000 Crore in AP: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా.. ఇప్పుడు ప్రముఖ సంస్థ రిలయన్స్ ఏపీలో భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది.. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – రిలయన్స్ మధ్య ఒప్పందం కుదిరింది.. ఆంధ్రప్రదేశ్ లో రూ.65 వేల కోట్ల భారీ పెట్టుబడులపై రిలయన్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది.. రాష్ట్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 500 బయోగ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు చేయనుంది. రూ.65 వేల కోట్ల పెట్టుబడులతో, 2.5 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెబుతున్నారు రిలయన్స్ బయో ఎనర్జీ చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్ బషీర్ షిరాజీ.. ఇక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో, రిలయన్స్ సంస్థ ఎంఓయూ చేసుకోవడం, ఒక చారిత్రాత్మక ఘట్టం. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక రీసెర్చ్ సెంటర్ పెడుతున్నారని తెలిసింది. దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..
రిలయన్స్‌తో ఎంఓయూ చేసుకుంది ఏపీ ప్రభుత్వం.. కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారీ కోసం ఎంఓయూ చేసుకున్నారు.. 500 CBG Plants కోసం ఎంఓయూ జరగగా.. 130 కోట్లతో ఒక్కో ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్నారు.. అయితే, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా చేయాలి అన్నారు సీఎం చంద్రబాబు.. 25 ఏళ్లలో 57,650 కోట్ల బెనిఫిట్ ఉంటుంది.. ఒక్కొక ఫార్మర్ కు 30 వేల లీజ్ ఉంటుంది.. 500 ప్లాంట్లు పూర్తయితే రెన్యువబుల్ ఫ్యూయల్ 9.35లక్షల LCB లకు రీప్లేస్మెంట్ చేస్తారు.. 2.50 లక్షల ఉద్యోగాలు ఈ ప్రాజెక్టులోనే రావాలి.. 20 లక్షల ఉద్యోగాల కల్పనలో ఇది ఒక భాగం అన్నారు. ప్రొడక్షన్ 39 లక్షల మెట్రిక్ టన్నుల సీబీజీ ఏడాదికి వస్తుంది.. దీని వల్ల ఇండస్ట్రీయల్ గ్రోత్ బారీగా జరగుతుంది.. 110 లక్షల మెట్రిక్ టన్నులు ఫెర్మెంటెడ్ ఆర్గానికి మెన్యూర్ వల్ల కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకం తగ్గుతుంది.. రాష్ట్రంలో నే క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ఇప్పటికే తీసుకువచ్చాం.. 10 లక్షల కోట్లు పెట్టుబడులు ఈ పాలసీ ద్వారా ఆకర్షించాలని భావించాం అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..
Read Also: Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఉండి ఇవి తిన్నారో.. ఇక దబిడి దిబిడే
రిలయన్స్ తో ఎంవోయూ చేసుకున్నాం.. ప్రపంచంలో అతి ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వారు ఇండియాకి చెందిన వారే అన్నారు సీఎం చంద్రబాబు.. వన్ ఫ్యామిలి వన్ ఎంట్రపెన్యూర్ అనేది మా లక్ష్యం అన్నారు.. ఇక, ఈ సందర్భంగా మంత్రులు లోకేష్, గొట్టిపాటి రవి, టిజి భరత్ లను ప్రత్యేకంగా అభినందించారు చంద్రబాబు.. అతి స్వల్పకాలంలో ఈ ఎంవోయూ కోసం లోకేష్ బాగా పనిచేశారు.. లోకేష్ కు 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్ ఇచ్చాము, ఆ దిశగా ఆయన ముందుకు వెళుతున్నారు.. మంత్రి గొట్టిపాటి రవి కూడా ఒప్పందం కార్యరూపం దాల్చడానికి బాగా సహకరించారు.. మంత్రి టిజి భరత్ ఉన్నత విద్యావంతుడు చాలా మంచి వర్క్ చేస్తున్నాడు.. ఈ ముగ్గురు చాలా బాగా పనిచేస్తున్నారు అంటూ ప్రశంసలు కురిపించారు.. మావైపు ఫుల్ స్వింగ్ లో ఉన్నాం అటు రిలయన్స్ కూడా స్పీడ్ గా ఎక్సిక్యూట్ చేస్తారనే పేరు ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టులను 3 సంవత్సరాల్లోనే కార్యరూపం లోకి తీసుకురావాలి అని అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..