Site icon NTV Telugu

AP ministers Ranks: ఏపీ మంత్రులకు ర్యాంకులు.. ఎవరు ఏ స్థానంలో ఉన్నారంటే…?

Ap Ministers Ranks

Ap Ministers Ranks

AP ministers Ranks: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పదేపదే డేటా మీద ఎక్కువ మాట్లాడుతుంటారు… ఎమ్మెల్యేల విషయంలో కానీ.. మంత్రుల విషయంలో కానీ ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకుంటూ ఉంటారు.. అందులో భాగంగానే ప్రస్తుతం మంత్రులకు సంబంధించి ర్యాంకులు ఇస్తున్నారు… ఇందులో భాగంగా మొదట ఫైల్ క్లియరెన్స్ కు సంబంధించి ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఈ ర్యాంకింగ్ లో మొదటి స్థానంలో మంత్రి రామానాయుడు ఉన్నారు.. రెండో స్థానంలో నారా లోకేష్.. మూడవ స్థానంలో సత్య కుమార్ ఉన్నారు.. నాలుగు, ఐదు స్థానాల్లో అనిత, నాదెండ్ల మనోహర్ ఉన్నారు.. ఇక, చివరి స్థానంలో కొల్లు రవీంద్ర.. అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ ఉన్నారు. వచ్చే కేబినెట్ సమావేశంలో మంత్రుల పెర్ఫార్మన్స్ కు సంబంధించి కూడా ర్యాంకులు ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు… మంత్రుల పనితీరు ఏ రకంగా ఉంది.. శాఖల మీద ఎంతవరకు పట్టు సంపాదించారు… అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ర్యాంకింగ్స్ ఇవ్వనున్నారు సీఎం చంద్రబాబు…

Read Also: Betting Seva : మీ సేవా సెంటర్ కాదు.. మై బెట్టింగ్ సెంటర్..!

మంత్రులకు పెర్ఫార్మన్స్ ఆధారంగా ర్యాంకులు ఇవ్వటం అంశం మీద ప్రధానంగా చర్చ జరుగుతోంది… మంత్రుల పనితీరు కు సంబంధించి ప్రామాణికంగా తీసుకున్నారా లేకపోతే నిజంగానే పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ గా ఈ ర్యాంకింగ్స్ పై దృష్టి పెట్టారా అనే చర్చ జరుగుతోంది.. పనితీరు ఏ రకంగా ఉంది.. శాఖల మీద ఎంతవరకు మంత్రికి పట్టు ఉంది అనే అంశం మీద సీఎం చంద్రబాబు ఎప్పుడు దృష్టి పెడుతుంటారు.. ఆ పనితీరు ఆధారంగానే నివేదికలను పక్కన పెట్టుకొని ర్యాంకింగ్ ఇస్తూ ఉంటారు. అన్ని విషయాలు బేరీజు వేసుకుని ర్యాంకింగ్స్ ఇస్తారు. ప్రధానంగా నియోజకవర్గాల్లో మంత్రులు.. పర్యటించడం జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఎంతవరకు బాధ్యతలు నిర్వహిస్తున్నారని చూడటం…. వైసీపీకి ఎంతవరకు కౌంటర్లు ఇస్తున్నారు అనే విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. వీటితోపాటు ప్రభుత్వ పథకాలను జనంలోకి ఎంతవరకు తీసుకెళ్లగలుగుతున్నారు… ప్రభుత్వ పథకాలకు సంబంధించి మంత్రులు ఎమ్మెల్యేలు సమన్వయంతో ఎలా ముందుకు వెళుతున్నారు.. వీటన్నిటి మీద కూడా ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది..

Read Also: Delta Flight Horror: గాల్లో ఉండగానే విరిగిన విమానం రెక్క.. 68 మంది ప్రయాణికుల ప్రాణాలు.. (వీడియో)

మంత్రులకు ర్యాంకింగ్ ఇవ్వటం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా.. అనే చర్చ కూడా ప్రధానంగా జరుగుతోంది… ఒక మంత్రిని ఎక్కువ పని చేశారు.. తక్కువ పని చేశారు … అని చెప్తే కనుక వాళ్ళల్లో కొంత అభద్రతా భావం. ఏర్పడుతుందనే చర్చ. కూడా ప్రధానంగా ఉంది.. ఈ ర్యాంకింగ్ తెలిస్తే కొంతమంది మంత్రులు సరిగా పనిచేయట్లేదు అనే ఇండికేషన్ కూడా వెళ్లే ప్రమాదం ఉందని కొంతమంది చర్చించుకున్నట్టుగా సమాచారం. అయితే పరిస్థితి బట్టి ముందు వెనక ఉండొచ్చు.. ప్రతి రోజు మంత్రుల పనితీరు కు సంబంధించి నివేదికలు తీస్కుంటూ ఉన్నారు.. కానీ, ఎప్పుడో ఒక సారి సడన్ గా ర్యాంకులు ఇస్తే టాప్ టెన్ లో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.. కింద స్థాయిలో ర్యాంక్స్ ఉన్నవాళ్లు ఇబ్బంది పడే అవకాశం ఉంది.. ఇదే చర్చ ప్రధానంగా జరుగుతోంది..

Read Also: Dharma Wife Gauthami : లేడీ డాక్టర్ నా భర్త ఒడిలో కూర్చుని రాత్రంతా.. హీరో ధర్మ భార్య ఆరోపణలు

సీఎం చంద్రబాబు ఆలోచన ప్రకారం మంత్రుల నుంచి మెరుగైన పనితీరు రాబట్టాలంటే వారికి ర్యాంకింగ్ ఇవ్వడం వల్లే సాధ్యమవుతుందని బాగా ఆలోచిస్తున్నారు.. పార్టీలో నాయకులు, కార్యకర్తలు జనంలోకి వెళ్లి కలవడం దగ్గర నుంచి మంత్రులు పనితీరును అంచనా వేయడం వరకు సీఎం చంద్రబాబు ఎప్పుడు డేటా మీద.. నివేదికల మీద ఆధారపడుతూ ఉంటారు… ఇప్పుడు కూడా మంత్రుల పనితీరు మీద ర్యాంకింగ్ ఇస్తున్నారు.. ఫైల్ క్లియరెన్స్ కావచ్చు.. రివ్యూ కావచ్చు.. ప్రెస్ మీట్ లు కావచ్చు.. అని ఎవరెన్ని నిర్వహించారు… అనేది ఒక కొలమానంగానే చూస్తున్నారు… ఇలా చూడటం వల్ల ర్యాంకింగ్స్ ఇవ్వటం వల్ల భవిష్యత్తులో ప్రతి మంత్రి తన పనితీరు మీద ఎక్కువ ఫోకస్ పెట్టడానికి.. ఎక్కువ పని మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుందని ఆలోచనతో సీఎం చంద్రబాబు ఉన్నారు. అందులో భాగంగానే ఇలా ర్యాంకింగ్ ఇవ్వటం మంత్రుల్లో ఒక జవాబుదారీ తనాన్ని పెంచడం.. అంతే అదే విధంగా హార్డ్ వర్క్ నేచర్ డెవలప్ చేయడం దీని మీద ప్రధానంగా సీఎం చంద్రబాబు ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది.. అందుకే. ఫైళ్ల క్లియరెన్స్ ర్యాంకులు విషయంలో ప్రధానంగా లిస్టు పెట్టారు.. వచ్చే కేబినెట్‌ సమావేశంలో మంత్రుల పనితీరుపై. పెర్ఫామెన్స్ పై ర్యాంకింగ్ ఇవ్వనున్నారు సీఎం చంద్రబాబు..

Exit mobile version