Site icon NTV Telugu

Rammohan Naidu: జగన్ ప్రభుత్వ వైఖరి కారణంగా రైతులకు అనేక చిక్కుముడులు..!

Rammohan Naidu

Rammohan Naidu

Rammohan Naidu: వైఎస్‌ జగన్ ప్రభుత్వ వైఖరి కారణంగా వ్యవసాయ రంగానికి, రైతులకు అనేక చిక్కుముడులు ఏర్పడ్డాయని విమర్శించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశమైన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్‌ జగన్ హయాంలో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింది.. రైతాంగం అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారన్నారు.. వ్యవసాయం సహా ఏ రంగాన్ని జగన్‌ పట్టించుకోలేదని ఆరోపించిన ఆయన.. కేంద్రంలోని.. ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రైతాంగం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయన్నారు.. వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిష్కరించుకుంటూ రైతాంగం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయని స్పష్టం చే శారు..

Read Also: Pat Cummins Reaction : కొత్త టీమిండియాను చూస్తే భయమేస్తోంది

ఇక, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రైతు పక్షపాతి.. రైతుల కోసం ఏ సహాయాన్ని అయినా చేస్తారని తెలిపారు రామ్మోహన్ నాయుడు.. ప్రస్తావించిన ప్రతి విషయంలో సహాయం చేయడానికి ముందుకు వచ్చారని వివరించారు.. రాజీవ్ రంజన్ కూడా గరివిడి కాలేజీ పై వెంటనే స్పందించారు.. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు.. ఈ రోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశం అయ్యారు.. రాష్ట్రంలోని రైతుల సమస్యలపై చర్చించారు..

Exit mobile version