NTV Telugu Site icon

Heavy Rains in AP: 3 రోజులు వర్షాలే వర్షాలు.. కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

Heavy Rains

Heavy Rains

Heavy Rains in AP: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా తీవ్ర అల్పపీడనంగా మారింది.. ఇది, ఆంధ్రప్రదేశ్‌కు ముప్పుగా మారుతోంది. తమిళనాడు తీరానికి చేరువగా వచ్చి దిశను మార్చుకుంటుందని.. ఆ తర్వాత ఏపీ తీరం వెంబడి బలమైన ఈదురు గాలులతో పయనిస్తుందని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.. ముఖ్యంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు ఛాన్స్ వుంది. ఇక, గడచిన 24 గంటల్లో విజయనగరం జిల్లా డెంకాడలో 2 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. తీవ్ర అల్పపీడనంపై విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్‌ పూర్తి వివరాలను వెల్లడించారు.. ఇక, పంటలు కోసే సమయం కావడంతో.. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు..

Read Also: Ashwin Retirement: అశ్విన్‌ను హగ్ చేసుకున్న విరాట్.. భావోద్వేగం(వీడియో)

ఇక, ఇవాళ, రేపు వర్షాలు కురుస్తాయనే అధికారుల హెచ్చరికతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో వరి పంట పండించే రైతులు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.. ఇవాళ రేపు వర్షాలు పడతాయి కాబట్టి కోత కోయద్దని అధికారులు చెబుతున్నప్పటికీ కూడా ఇప్పటికే ఆలస్యమైందని కోత కోయకపోతే ధాన్యం చేలోనే రాలిపోతుందని అందుకనే కోత కోయద్దని అధికారులు చెప్పినా ఎలాగైనా నష్టం చవి చూస్తామన్న ఆలోచనతో రైతులు కోత కోస్తున్న పరిస్థితి ఉమ్మడి కృష్ణా జిల్లాలో కనబడుతోంది.. ఇటీవల ఫంగల్ తుఫాను వల్ల కురిసిన వర్షాలకి ధాన్యం తడిచి ఇబ్బందులు పడిన రైతులు ఇప్పుడు అకాల వర్షం వస్తుందని చెప్పినా కూడా దాన్ని ఖాతరు చేయకుండా చేలో ఉన్న పంటని కోస్తున్న పరిస్థితి ఉందంటున్నారు..

Show comments