ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) కొత్త ఛైర్మన్‌గా జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు. కాగా.. పీఏసీ సభ్యులుగా ఎన్నికైన వారిలో శ్రీరాం రాజగోపాల్, బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఆరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనంద్‌బాబు, కోళ్ల లలిత కుమారి, విష్ణు కుమార్‌రాజు ఉన్నారు.
Read Also: Ban jokes on Sikhs: సిక్కులపై జోక్స్ నిషేధించాలి.. సుప్రీంకోర్టులో విచారణ..
అసెంబ్లీ కమిటీ హాల్‌లో ప్రాధాన్య ఓట్ల విధానంలో పీఏసీ సభ్యత్వాలకు పోలింగ్ జరిగింది. బ్యాలెట్ పత్రాలపై ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీ ఆర్థిక కమిటీలో ఏదైనా పార్టీ నుంచి ఒక సభ్యుడు ఎన్నికవ్వాలంటే ఆ పార్టీకి అసెంబ్లీలో సంఖ్యా బలం కనీసం 18 ఉండాలి. అయితే వైసీపీకి కేవలం 11 మంది సభ్యులు ఉండటంతో.. మూడు కమిటీలకు ముగ్గురు వైసీపీ సభ్యులు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. కాగా.. ఎమ్మెల్యేల కోటాలో 9కి గాను మొత్తం 10 చొప్పున నామినేషన్లు దాఖలుయ్యాయి. దీంతో పోలింగ్ నిర్వహించారు. మరోవైపు.. ఏపీ అసెంబ్లీ చరిత్రలోపీఏసీ కమిటీ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించడం తొలిసారి. కాగా.. పీఏసీ కమిటీ ఛైర్మన్ పదవిని అధికారపక్షం మొదటి సారి దక్కించుకుంది. అయితే.. పీఏసీ కమిటీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షానికి అప్పగించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు.. అనూహ్యంగా పీఏసీ కమిటీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షానికి ఇచ్చేందుకు అధికారపక్షం ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ఎన్నిక జరిగింది.
Read Also: AP Legislative Council: మండలిలో లోకాయుక్త సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి లోకేష్..