NTV Telugu Site icon

Amaravati: వైసీపీ అధినేత జగన్‌ను కలిసిన పిన్నెల్లి గ్రామస్తులు..

Ys Jagan

Ys Jagan

తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ను గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామస్తులు కలిశారు. దాదాపు 400 వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరుల కుటుంబాలపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ బహిష్కరణ వేటు వేశారు. బహిష్కరించిన వారిలో అన్ని కుటుంబాలు మైనారిటీ, ఎస్సీ, బీసీలకు చెందినవే ఉన్నాయి. కాగా.. వచ్చే రెండు నెలల్లో ఛలో పిన్నెల్లి కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ సిద్దమవుతుంది. ఈ క్రమంలో.. గ్రామ బహిష్కరణ విషయంపై వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ న్యాయపరంగా హైకోర్టులో కూడా పోరాడుతుంది.

Read Also: Lunar Eclipse: రేపే సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్ లో కనిపిస్తుందా?

కాగా.. గ్రామ బహిష్కరణకు గురైన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. అవసరమైన పూర్తి న్యాయ సహాయం అందించనున్నట్లు వారికి భరోసానిచ్చారు. వైసీపీ సానుభూతిపరులన్న కారణంతో గ్రామం నుంచి బహిష్కరించారని.. గ్రామంలోకి వస్తే చంపేస్తామని కూటమి నేతలు బెదిరిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు జగన్‌కు చెప్పుకున్నారు. వారికి అండగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉంటుందని వైయస్‌ జగన్‌ భరోసానిచ్చారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి ఆధ్వర్యంలో పిన్నెల్లి గ్రామస్తులు వైయస్‌ జగన్‌ను కలిశారు. వీరితో పాటు తురకపాలెం, మాదెనపాడు, చెన్నాయపాలెం గ్రామాలకు చెందిన మరికొంత మంది కూడా జగన్‌ను కలిశారు.

Read Also: Mahindra XUV 3XO: మహీంద్రా XUV 3XO కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్..