Site icon NTV Telugu

Perni Nani: పులివెందులలో పోలీసులు టీడీపీకి వంత పాడుతున్నారు..

Perni Nani

Perni Nani

Perni Nani: విజయవాడలోని ఎన్నికల కమిషన్ ను వైసీపీ నేతల బృందం కలిసింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా జరుగుతున్న వరుస ఘటనలపై ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీమంత్రులు పేర్ని నాని, మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మేల్యేలు సుధాకర్ బాబు ఫిర్యాదు చేశారు. పులివెందుల పోలింగ్ స్టేషన్ ల మార్పుపై మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Read Also: Bandi Sanjay: కేటీఆర్‌కు బండి సంజయ్ సవాల్: నా ఫోన్, సీఎం రేవంత్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు

ఈ సందర్భంగా వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. దేశంలో ఇంత ఘోరంగా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదు.. ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకుని నిద్ర నటిస్తోంది.. నిద్రపోయేవాడిని నిద్రలేపొచ్చు.. కానీ, నిద్ర నటించే వారిని ఏమీ చేయలేమన్నారు. ఎన్నికల కమిషన్ సీట్లో కూర్చున్నవాళ్లే ఇలా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం ఎలా బ్రతుకుతుంది అని ప్రశ్నించారు. పులివెందులలో ఓటర్లకు దూరంగా పోలింగ్ బూతులు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. అలాగే, పులివెందులలో పోలీసులు టీడీపీకి వంత పాడుతున్నారంటూ మండిపడ్డారు. గోడకు చెప్పిన ఒక్కటే.. ఈసీకి చెప్పిన ఒక్కటే అని మాకు అర్థమైంది.. ఈసీ అధికారులు, కలెక్టర్, పోలీసులు అంతా కలిసి పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు అని పేర్నినాని విమర్శించారు.

Exit mobile version