Site icon NTV Telugu

Ganesh Chaturthi Online Permission: గణేష్‌ ఉత్సవాలకు ఆన్‌లైన్‌లోనే అనుమతులు.. ఇలా చేస్తే చాలు..!

Ganesh Chaturthi Online Per

Ganesh Chaturthi Online Per

Ganesh Chaturthi Online Permission: గణేష్‌ ఉత్సవాలకు సమయం దగ్గర పడుతోంది.. అయితే, గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే అనుమతులు తప్పనిసరి.. పోలీసులు, విద్యుత్‌శాఖ.. ఇలా పలు రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.. ఇది, కాస్త ఇబ్బందితో కూడిన పని కూడా.. అయితే, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఆన్‌లైన్‌లోనే గణేష్‌ ఉత్సవాలకు అనుమతి ఇస్తోంది.. దీని కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.. సింగిల్‌ విండో విధానంలో ఆన్‌లైన్‌లోనే అన్ని అనుమతులు పొందేలా ఏర్పాట్లు చేసింది..

Read Also: Harish Rao : రేవంత్ రెడ్డి ఓ చేతకాని ముఖ్యమంత్రి

వినాయక ఉత్సవాలకు అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రత్యేకంగా ganeshutsav.net అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.. మండపాల నిర్వాహకులు ఈ వెబ్‌సైట్‌ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్‌లైన్‌లో అనుమతులు పొందవచ్చు. ఇక, ఈ అనుమతులు పొందడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు పోలీసులు.. అయితే, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత, సంబంధిత పోలీస్ అధికారి మండప స్థలాన్ని తనిఖీ చేసి, నిబంధనల ప్రకారం ఉంటే QR కోడ్‌తో కూడిన నిరభ్యంతర పత్రాన్ని (NOC) జారీ చేస్తారు. బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసే వినాయక మండపాలకు మాత్రమే ఈ అనుమతులు తప్పనిసరి. ఈ ఆన్‌లైన్ వ్యవస్థ ఉత్సవాలను సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించడానికి ఈ అనుమతుల ఉద్దేశం అంటున్నారు ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా..

Exit mobile version