AP Pensions: ఆంధ్రప్రదేశ్‌లో అనర్హులు కూడా పెన్షన్లు అందుకుంటున్నట్టు స్పష్టం అవుతోంది.. ప్రతీ 10 వేల మందిలో ఏకంగా దాదాపు ఐదు వందల మంది అనర్హులే పెన్షన్లు తీసుకుంటున్నట్టు గుర్తించారు.. రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణపేదరిక నిర్మూలన శాఖలపై ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్.. పెన్షన్ లు అర్హత లేనివారికి వస్తున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయని వెల్లడించిన ఆయన.. తాము నిర్వహించిన సర్వేలో ప్రతీ పదివేలకూ 500 మంది వరకూ అనర్హులని తేలినట్టు స్పష్టం చేశారు.. అయితే, గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు 6 లక్షల మందికి హడావుడిగా పెన్షన్లు ఇచ్చారు.. ఇందులో చాలా మంది అనర్హులే ఉన్నారని వ్యాఖ్యానించారు మంత్రి నాదెండ్ల మనోహర్..
Read Also: Maharashtra Cabinet: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఢిల్లీకి మహాయుతి నేతలు!
ఇక, వచ్చే మూడు నెలల్లోగా ప్రతీ పెన్షన్ ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు.. మరోవైపు, గ్రామీణ ఉపాధి హామీ పథకం డిమాండ్ కు అనుగుణంగా నిర్వహించాల్సిన కార్యక్రమం అన్నారు.. వందరోజులు పనిదినాలను సరిగా నిర్వహిస్తే మెటీరియల్ కాంపోనెంట్ వస్తుందన్న ముఖ్యమంత్రి.. పని దినాలు, మెటీరియల్ కాంపోనెంట్ ను పూర్తి చేయలేక పోతున్నారని వ్యాఖ్యానించారు.. పల్లె పండుగలో 14.8 పర్సెంట్ మాత్రమే పనులు చేశారని ఇంకా నెలన్నర సమయం మాత్రమే ఉందన్న సీఎం.. అల్లూరి జిల్లాలో 54శాతం పూర్తైతే మరో జిల్లాలో 1.6 శాతం మాత్రమే పనులు జరగటంపై ప్రశ్నించారు. పని పూర్తైన వెంటనే బిల్లులు ఎందుకు చెల్లించటం లేదని నిలదీశారు.. కలెక్టర్లు ఎందుకు నిర్లిప్తంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం.. జలజీవన్ మిషన్ ను గత ప్రభుత్వం మొత్తం దెబ్బ తీసిందన్న సీఎం.. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం తిరిగి ప్రారంభించామన్నారు.. గ్రామాల్లో కనీసమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు.. మరోవైపు.. తల్లిదండ్రులు చనిపోయి చిన్నారులు ఉంటే వారికీ పెన్షన్ ఇవ్వాలని సూచించారు.. ఇక, దివ్యాంగులు చాలా మంది 15 వేల పెన్షన్ అడుగుతున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు కలెక్టర్లు.. సదరం ధృవీకరణ పత్రాలను అర్హులకే దక్కేలా చూడాలని సూచించారు సీఎం చంద్రబాబు నాయుడు..