Site icon NTV Telugu

Pawan Kalyan to Singapore: కుమారుడికి ప్రమాదం.. హుటాహుటిన సింగపూర్‌కు పవన్‌ కల్యాణ్‌..!

Pawan

Pawan

Pawan Kalyan to Singapore: మన్యం పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.. తన పర్యటనను కుదించుకున్నట్టుగా తెలుస్తోంది.. సింగపూర్‌లో పవన్‌ కల్యాణ్‌ కుమారుడు చదువుతోన్న స్కూల్‌లో అగ్నిప్రమాదం జరగడం.. ఈ ఘటనలో పవన్‌ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ గాయాలపాలు కావడంతో.. వెంటనే బయల్దేరాల్సిందిగా.. పవన్‌ కల్యాణ్‌ను కోరారట.. పార్టీ నేతలు, అధికారులు.. అయితే, ముందుగా ఫిక్స్‌ చేసిన షెడ్యూల్‌ ఉండడంతో.. కొంతవరకు కుదించారు.. మన్యం నుంచి విశాఖపట్నం రానున్న పవన్‌ కల్యాణ్‌.. అక్కడి నుంచి హుటాహుటిన సింగపూర్‌ బయల్దేరి వెళ్లనున్నారు..

Read Also: Pawan Kalyan Son Mark Shankar: పవన్‌ కల్యాణ్‌ కుమారుడికి గాయాలు..

ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీలో డిప్యూటీ సీఎం పవన్‌ పర్యటన కొనసాగుతోంది.. డుంబ్రిగుడ మండలం కురిడి గ్రామానికి చేరుకున్నారు.. 2018 ప్రజా పోరాట యాత్రలో కురిడి గ్రామ శివాలయంలో మొక్కుబడిని తీర్చుకునేందుకు గ్రామానికి చేరుకున్నారు.. ఆ తర్వాత అరకు నుంచి నేరుగా వైజాగ్‌ ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు.. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ సింగపూర్ వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వ యంత్రాంగం.. అయితే, జూపార్క్ లో జరగాల్సిన ఏకో టూరిజం కాన్ఫరెన్స్ రద్దు చేసుకున్నారు పవన్‌.. ఇక, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ భార్య అన్న లెజినోవా సింగపూర్‌లోనే ఉంటున్నట్టుగా సమాచారం.. పవన్‌కు కుదిరినప్పుడు.. ఆయనే సింగపూర్‌ వెళ్లివస్తున్నారని తెలుస్తోంది..

Exit mobile version