Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు ఆయుర్వేద థెరపీ.. రేపు కేరళకు డిప్యూటీ సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రేపు అనగా శనివారం కేరళకు వెళ్లనున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజానికి రొటేటర్ కఫ్ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన.. వైద్యుల సూచన మేరకు తదుపరి చికిత్సలో భాగంగా కేరళలో ప్రత్యేక ఆయుర్వేద థెరపీ చేయించుకోనున్నారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు పవన్ కల్యాణ్‌కు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కొంతకాలం బహిరంగ కార్యక్రమాలకు, అధికారిక విధులకు దూరంగా ఉండాలని కూడా వైద్యులు సూచించినట్లు జనసేన కేంద్ర కార్యాలయం తెలిపింది. అయితే పాలనా బాధ్యతల నేపథ్యంలో ఆయన వారం రోజుల్లోనే క్యాంపు కార్యాలయానికి అందుబాటులోకి వచ్చారు.
ఆ తర్వాత ముందుగా ఖరారైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు వరుసగా శాఖాపరమైన సమీక్షలు, పార్టీ అంతర్గత సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలో శస్త్రచికిత్స చేసిన కుడి భుజం ప్రాంతంలో వాపు పెరగడంతో పాటు తీవ్రమైన జ్వరం కూడా వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు భుజం పూర్తిస్థాయిలో కోలుకునేలా చికిత్స తీసుకోవాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే కేరళలోని ఆయుర్వేద వైద్యాలయంలో ప్రత్యేక ఆయుర్వేద థెరపీ చేయించుకోనున్నారు. వైద్యుల సూచనల మేరకు చికిత్స, విశ్రాంతికి ప్రాధాన్యత ఇస్తూనే తన పాలనా బాధ్యతలను కొనసాగించేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నట్లు జనసేన కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!