Site icon NTV Telugu

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ మరో కానుక.. 10 వేల మంది పిఠాపురం ఆడపడుచుల కోసం..!

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గం ఆడపడుచులకు.. ఇతర వ్యక్తులకు సందర్భాన్ని భట్టి ఏదో ఓ కానుకలు ఇస్తూనే ఉంటారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. అంతేకాదు, ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు తన తోటలో పండిన మామిడి పళ్లు, చెప్పులు, దుప్పట్లు.. ఇలా ఏవి పంపించినా ఆయనకే చెల్లింది.. ఇక, ఇప్పుడు పిఠాపురం ఆడపడుచులకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శ్రావణ శుక్రవారం కానుక సిద్ధం చేస్తున్నారు.. శక్తిపీఠం పురుహూతిక అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.. 10 వేల మంది ఆడపడుచులకు పసుపు, కుంకుమ, చీరలు పంపిణీ చేయబోతున్నారు పవన్‌ కల్యాణ్..

Read Also: East Godavari: భార్యను కాపురానికి పంపించని అత్తమామలు.. హతమార్చిన అల్లుడు!

22వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఈ వరలక్ష్మీ వ్రతాలు ప్రారంభం కాబోతున్నాయి.. మొత్తం 5 విడతలుగా వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.. ఒక్కో బ్యాచ్ కు ఒక్కో అమ్మవారి పేరునా అంబిక, భ్రమరాంబ, చాముండి, దుర్గ, ఈశ్వరి అని నామకరణం చేశారు.. అంబిక భక్త బృందం ఉదయం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు, భ్రమరాంబ భక్త బృందం 6.30 గంటల నుంచి 8 గంటలు వరకు, చాముండి భక్త బృందం 8 గంటల నుంచి 9.30 గంటల వరకు, దుర్గ భక్త బృందం 9.30 నుంచి 11 గంటల వరకు, ఈశ్వరి భక్త బృందం 11 నుంచి 12.30 గంటల వరకు వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు..

Read Also: Baahubali : బాహుబలి ఎపిక్ కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఒకే వేదికపై ప్రభాస్,అనుష్క..

ఇక, మధ్యాహ్నం 1 గంట తరవాత వచ్చే ఆడపడుచులకు కూడా పవన్ కల్యాణ్‌ పంపించిన పసుపు, కుంకుమ, చీరలను కానుకగా అందించనున్నారు.. మొత్తం 10 వేల మంది ఆడపడుచులకు చీరల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.. దీనికి సంబంధించిన కూపన్ల పంపిణీ గురువారం నుంచి ప్రారంభమవుతుంది..కూపన్లు మీద సమయం ముద్రించి ఉంటుంది.. ఆయా కూపన్లు అందుకున్నవారు.. ఆ టికెట్లపై ఉన్న టైంను ఫాలో కావాల్సి ఉంటుంది..

Exit mobile version