మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరారు. పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బాలశౌరిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం బాలశౌరి విజన్ తనకు నచ్చిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అనంతరం సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనని అర్జునుడుగా జగన్ పోల్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆరోపించారు. సొంత చెల్లి షర్మిలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా సపోర్ట్ చేస్తున్న జగన్ అర్జునుడా అని విమర్శించారు. సొంత చిన్నాన్నను చంపిన వారిని వెనకేసుకుని వస్తున్న జగన్ అర్జునుడా అని అన్నారు.
Balashowry: దమ్ము ధైర్యంతో ప్రశ్నించే నాయకుడు పవన్ కల్యాణ్..
మేము జగన్ లా అర్జునుడు, శ్రీ కృష్ణుడులా పోల్చుకోవడం లేదు.. మీరు వైసీపీ నేత జగన్.. మేము జనసేన అంతే.. ఎవరూ మంచి చేస్తారో ప్రజలు నిర్ణయిస్తారని పవన్ కల్యాణ్ తెలిపారు. మరోవైపు.. సిద్ధం అని రాష్ట్రం అంతా పోస్టర్లు వేస్తున్నారు.. దేనికి సిద్ధం..? అని ప్రశ్నించారు. జగన్ చెప్పేవన్నీ అబద్దాలే.. దేనికి సిద్ధమని దుయ్యబట్టారు. మద్యపాన నిషేధం, సీపీఎస్ రద్దు, ఉద్యోగాల భర్తీ మాట తప్పారని మండిపడ్డారు. జగన్ బాధపడకు.. మేము- వస్తున్నాం.. మిమల్ని ఎండగడతానని దుయ్యబట్టారు.
Minister Kakani: చంద్రబాబు, లోకేష్, సోమిరెడ్డి నాపై నిందలు వేశారు..
నేను చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధం అని పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన – టీడీపీ ప్రభుత్వం స్థాపించబోతున్నామని తెలిపారు. పొత్తులతో కొంచం కష్టంగా ఉంటుంది.. సీట్ల సర్దుబాటులో కొంతమందికి బాధ కలిగిస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన బలమైన పాత్ర ఉంటుందని పేర్కొన్నారు. జనసేన పోటీ చేసే స్థానాలు 98 శాతం విజయావకాశాలు ఉన్నాయని అన్నారు. జగన్ దుర్మార్గపు పాలన నుండి రాష్ట్రాన్ని రక్షించాలని ఆయన తెలిపారు. గతంలో సీపీఐ, సీపీఎం పార్టీలతో పొత్తు సమయంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి.. ఇప్పుడు టీడీపీ పొత్తు సీట్ల సర్దుబాటులో కొన్ని ఇబ్బందులు ఉంటాయని అన్నారు. తనపై నమ్మకంతో అంతా తన వెనుక నడవండి అని తెలిపారు. ఎంత అని కాదు.. ఎన్నని కాదు.. 98 శాతం స్ట్రైక్ రేట్ ఉండాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.