Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మాత్రమే కాదు… సనాతన ధర్మ రథసారథి కూడా. హైందవ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్‌గా తన ముద్రను ఖచ్చితంగా వేసుకుంటున్నారు. సినిమా స్టార్‌గా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న పవన్… ఇప్పుడు సనాతన ధర్మానికి సారథిగా మారుతున్న తీరు స్పష్టమవుతోంది. తమిళనాడులోని మధురైలో జరిగిన మురుగన్ భక్త సమ్మేళనంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్… హిందూ ధర్మంపై తన ఉజ్జ్వల ఆలోచనలను పంచుకున్నారు. సనాతన ధర్మం ఒక మతం కాదు. మన జీవన విధానం. దాన్ని గౌరవించటం మన బాధ్యత. అని స్పష్టమైన సందేశం ఇచ్చారు. తన ఆలయాల సందర్శనలు, సంప్రదాయాలపై వ్యాఖ్యలు, సంస్కృతికి ఉన్న నిబద్ధత ద్వారా పవన్ కళ్యాణ్ రాజకీయాల ధర్మాన్ని రాజకీయంతో మేళవిస్తూ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. ఇంగ్లీష్, హిందీ, తమిళం, మరాఠీ భాషల్లో మాట్లాడగల సామర్థ్యం ఆయనకు దేశవ్యాప్తంగా అనుబంధాన్ని పెంచే అంశంగా నిలుస్తోంది. జాతీయ స్థాయి హిందూ ప్రతినిధిగా మార్చే దిశగా తీసుకెళ్తోంది.
Read Also: Telangana Cabinet Meeting: ముగిసిన తెలంగాణ క్యాబినెట్ సమావేశం
మధురై సభతో పవన్ కళ్యాణ్‌ను హిందూ బ్రాండ్ అంబాసిడర్‌గా చూడటం మొదలైందంటున్నారు విశ్లేషకులు. పవవన్ మాటల్లో స్పష్టత ఉంది. సినిమాలు, రాజకీయాలు, ధర్మ ప్రచారం. ఇలా మూడు మార్గాల్లోనూ ప్రజల గుండెల్లో చోటు సంపాదించారు పవన్ కళ్యాణ్. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి ఆరోపణలు వినిపించగానే స్పందించిన మొదటి నేత పవన్ కళ్యాణ్. భక్తుల విశ్వాసంపై పవన్ గళమెత్తిన తీరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అది తేలికపాటి తప్పిదం కాదు… సనాతన ధర్మంపై కుట్ర అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయ్యాయి.
Read Also: Bengaluru: రెచ్చిపోయిన మృగాళ్లు.. నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై లైంగిక వేధింపులు
సినిమా స్టార్ నుంచి పొలిటికల్ స్టార్‌గా టర్న్ అయిన పవన్ కళ్యాణ్… ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడిగా కొత్త గుర్తింపును సంపాదించుకున్నారు. వారాహి డిక్లరేషన్ రూపంలో హిందూ సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చిన ఆయన… తిరుమల ఘటనతో పాన్ ఇండియా హిందూ ఫైర్ బ్రాండ్‌గా మారిపోయారు. సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్‌కు కొత్త గుర్తింపు వచ్చిందంటున్నారు విశ్లేషకులు..
