Site icon NTV Telugu

Kolusu Parthasarathy: టీడీపీలో చేరిన పెనమలూరు ఎమ్మెల్యే.. తొలి జాబితాలోనే టిక్కెట్

Parthasarathi

Parthasarathi

పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరారు. విజయవాడలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన పార్థసారథి.. గతంలోనే టీడీపీ చేరతానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి జాబితాలో తనకు టిక్కెట్ ఇవ్వడం ఆనందంగా ఉందని పార్థసారథి అన్నారు. పార్టీ నిర్ణయం ప్రకారం నూజివీడు వెళ్తున్నానని తెలిపారు. మరోవైపు.. కోటి 30 లక్షల మందితో సర్వే చేసి టిక్కెట్లు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. నాన్ లోకల్ అయినా నూజివీడులో ప్రజల పూర్తి మద్దతు ఉందని తెలిపారు.

Read Also: Palnadu: పల్నాడులో కాక రేపుతున్న ఐవీఆర్ఎస్ సర్వేలు..

మరోవైపు.. టీడీపీలో చేరిన తర్వాత పార్థసారథి వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. వైసీపీలో బీసీలకు దళితులకు న్యాయం జరగడం లేదని.. పదవులు ఇచ్చినా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ విధానాలతో ఏపీకి భవిష్యత్ ఉండదన్నారు. అందువల్లే తాను వైసీపీకి రాజీనామా చేశానని వెల్లడించారు. చంద్రబాబు విజన్ భావితరాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పార్థసారథి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే నూజివీడు ఎమ్మెల్యే టిక్కెట్ను కొలుసు పార్థసారథికి టీడీపీ అధిష్టానం ప్రకటించింది. కాగా.. పార్టీ తనపై ఉంచిన నమ్మకం మేరకు ఈ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read Also: Radisson Drugs Case: రాడిసన్ డ్రగ్ కేసులో టాలీవుడ్ నిర్మాత పేరు?

Exit mobile version