NTV Telugu Site icon

CM Chandrababu: గుడ్‌న్యూస్‌ చెప్పిన చంద్రబాబు.. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ

Chandrababu

Chandrababu

CM Chandrababu: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్‌ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నేతలకు శుభవార్త చెప్పారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మంగళగిరి నిర్వహించిన ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దుష్ప్రచారాలని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.. మనం చేస్తున్న పనులను చెప్పుకుంటూనే.. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని సూచించారు.. వైఎస్ వివేకా హత్యపై వైసీపీ చేసిన దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టలేకపోయాం అన్నారు.. ఇక, నామినేటెడ్ పోస్టులు ఉంటాయి.. త్వరలో భర్తీ చేస్తామంటూ గుడ్‌న్యూస్‌ చెప్పారు..

Read Also: Bhadradri : భద్రాద్రి దేవాలయం పేరును ఉపయోగించి అమెరికాలో విరాళాలు

6 వేల మంది ఎల్జీ పాలిమర్స్ బాధితుల సమస్యలను స్థానిక ఎమ్మెల్యే పరిష్కరించారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు 100 రోజుల పాలనపై ప్రచారం చేపట్టాలని సూచించారు సీఎం చంద్రబాబు.. కేంద్రం, రాష్ట్రం చేసిన పనులు.. భవిష్యత్తులో చేసే పనులను చెప్పాలి. ప్రజలు మనల్ని గెలిపించారు కాబట్టి.. ఢిల్లీలో మన రాష్ట్ర గౌరవం పెరిగింది. ఢిల్లీలో గౌరవం పెరిగింది కాబట్టే.. పనులు అవుతున్నాయి. 175 గెలుస్తామనో.. 40 ఏళ్లు మనమే ఉంటామని ప్రజలకు చెప్పడం కాదు.. ప్రజలతోనే మేం ఉంటాం అని చెప్పాలి. నెలలో పది రోజులపాటు ప్రజల్లో ఉండాలి. జిల్లాల్లో ప్లానింగ్ బోర్టు మినిస్టర్లను నియమిస్తాం. జిల్లాల్లో మూడు పార్టీలు సమన్వయంతో పని చేసుకోవాలి. ప్లానింగ్ బోర్డు మినిస్టర్లు కూడా సమన్వయం చేసుకోవాలి. రెండు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలుపు కోసం పని చేయాలి. అభ్యర్థులు ఎవరో త్వరలో చెబుతాం. ప్రభుత్వ ప్రొగ్రాం చేద్దాం.. కానీ, పార్టీ భాగస్వామ్యం ఎక్కువగా ఉండాలి. 100 రోజుల్లో నిర్ధిష్టమైన టార్గెట్ పెట్టుకుని పని చేశాం.. దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని వెల్లడించారు సీఎం చంద్రబాబు నాయుడు..

Show comments