NTV Telugu Site icon

AP New Liquor Policy: అప్పటి నుంచి కొత్త లిక్కర్‌ పాలసీ.. ఇక, నాణ్యమైన మద్యం..

Kollu Ravindra

Kollu Ravindra

AP New Liquor Policy: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో లిక్కర్‌ అమ్మకాలపై, మద్యం నాణ్యతమైన చాలా ఆరోపణలే ఉన్నాయి.. అయితే, కూటమి ప్రభుత్వం కొత్త లిక్కర్‌ పాలసీని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.. అక్టోబర్ 1వ తేదీ నుండి నూతన మద్యం పాలసీ అమలుపరుస్తాం అన్నారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని కలెక్టరేట్‌లో మైనింగ్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర.. ఆరు రాష్ట్రాల్లో మద్యం పాలసీలపై అధ్యయనం చేస్తున్నాం.. గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలన్నిటిని భ్రష్టు పట్టించింది.. మద్యం పాలసీ సైతం భ్రష్టు పట్టిందని ఫైర్‌ అయ్యారు.. నాసిరకం లిక్కర్‌ను అధిక ధరలకు విక్రయించారు.. నాణ్యతతో కూడిన లిక్కర్ అందిస్తాం అన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో 45 వేల కోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపించారు కొల్లు రవీంద్ర..

Read Also: Bandi Sanjay: సిసోడియాకి మేం బెయిల్ ఇచ్చామా..? కవితకు ఇవ్వడానికి..

ఇక, రాష్ట్రంలో సంవత్సరానికి మూడు కోట్ల టన్నుల ఇసుక అవసరం ఉంది.. వరదల సమయం కావడంతో అక్టోబర్ 15 వరకు ఇసుక త్రవ్వకాలకు అనుమతి లేదు అన్నారు కొల్లు రవీంద్ర.. అక్టోబర్ 17 నుండి రాజమండ్రి నుండే రాష్ట్రం అంతా ఇసుక సరఫరా చేస్తామని.. రవాణా ఖర్చులు మించి అమ్మితే కఠిన చర్యలు తప్పవంటూ కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.. మైనింగ్ డిపార్ట్మెంట్ ను పటిష్టపరుస్తాం.. సోమవారం నుండి జిల్లాలో 8 స్టాక్ పాయింట్లను తెరుస్తాం అన్నారు.. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉచిత ఇసుక అందిస్తాం.. జూలై 10 నుండి ఉచిత అందిస్తున్నాం.. ఉచిత ఇసుక పంపిణీలో ఉన్న లోపాలను సరిదిద్దుతాం అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర..

Show comments