High Court: ఆంధ్రప్రదేశ్‌లో హెల్మెట్ల తప్పనిసరిగా ధరించటాన్ని పోలీసులు అమలు చేయకపోవటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు.. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకోవటంలేదని.. అసలు పట్టించుకోవడంలేదన్నారు న్యాయమూర్తి.. అయితే, ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ నెల వరకు 667 మంది హెల్మెట్ ధరించక పోవడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఈ మృతులకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది.. అసలు, ఎందుకు హెల్మెట్లను ధరించే నిబంధన అమలు చేయటంలేదని పోలీసులను నిలదీసింది.. అయితే, ట్రాఫిక్ విభాగంలో 8 వేల మందికి సిబ్బంది అవసరం ఉండగా.. కేవలం 1,800 మంది మాత్రమే ఉన్నారనికోర్టుకు తెలిపారు పోలీసులు.. అంతేకాదు.. ఫైన్లు వేసినా కట్టడం లేదని హైకోర్టుకు విన్నవించారు.. ఇక, రవాణా శాఖ కమిషనర్ ను సుమోటోగా ఇంప్లీడ్ చేసింది ఏపీ హైకోర్టు.. వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది..
Read Also: Syed Mushtaq Ali Trophy: విదర్భ బౌలర్లను ఊచకోత కోసిన అజింక్య రహానే.. సెమిస్‌లోకి దూసుకెళ్లిన ముంబై
కాగా, రోడ్డు ప్రమాదాల్లో ప్రతీ ఏటా పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.. సీట్లు బెల్టు ధరించి కొందరు.. హెల్మెట్ ధరించి మరికొందరు ఈ ప్రమాదాల నుంచి ప్రాణాలతో భయటపడుతుండగా.. ఎందో మంది ట్రాఫిక్ నిబంధలను పట్టించుకోకుండా తమ జీవితాలను చాలిస్తున్నారు..
