Ration Rice Distribution: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ వాహనాలను తొలగించారు.. ఇంటింటికి తీసుకొచ్చి వాహనాల్లో రేషన్ ఇవ్వడం వల్ల ఆర్థికంగా నష్టం వస్తుందని కూటమి ప్రభుత్వం వీటిని తొలగించింది.. వీటి స్థానంలో రేషన్ షాపులోనే ఇకనుంచి రేషన్ ఇవ్వనున్నారు. ప్రతి నెల 15 రోజులు పాటు రేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది.. 65 ఏళ్లు దాటిన వృద్ధులు.. దివ్యాంగులకు ఇంటి వద్దకు తెచ్చి ప్రతి నెల 5వ తేదీ లోపు రేషన్ అందిస్తారు.. ఇకనుంచి రేషన్ దుకాణాలను రేషన్ మాల్స్ గా మార్చి మిగిలిన వస్తువులు కూడా అందించడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది..
Read Also: Rajendra Prasad : మళ్లీ నోరు జారిన నటుడు రాజేంద్ర ప్రసాద్.. అలీని తిట్టేశాడు..
గత ప్రభుత్వం పై పౌర సఫరాలశాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రమైన విమర్శలు చేశారు.. గత ప్రభుత్వం రేషన్ వాహనాలను ఉపయోగించడం వల్ల 1700 కోట్లకు పైగా నష్టం వచ్చింది అన్నారు.. అదే విధంగా రేషన్ వాహనాల్లో మాఫియా వల్ల అక్రమ బియ్యం తరలింపు ఆస్కారం కలిగిందన్నారు.. రేషన్ వాహనాలు ఎప్పుడు వచ్చేవో కూడా తెలిసేది కాదన్నారు.. ఏదో ఒక మూల వాహనాన్ని పెట్టి కొంతమందికి రేషన్ ఇచ్చి వెళ్లిపోయే వారిని విమర్శలు చేశారు.. దీంతో ఖజానాకు నష్టం కాకుండా అక్రమ బియ్యం తరలింపు అస్కారాలు ఏర్పడింది అన్నారు నాదెండ్ల మనోహర్.
Read Also: Sharmistha Panoli Arrest: పవన్ కళ్యాణ్ తర్వాత, కంగనా రనౌత్.. శర్మిష్ట పనోలి అరెస్ట్‌పై ఆగ్రహం..
అయితే, రేషన్ వాహనాలు తొలగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైసీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది.. వృద్ధులకు వికలాంగులకు దివ్యాంగులకు ఈ నిర్ణయం వల్ల తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది అన్నారు మాజీ మంత్రి, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ . ప్రభుత్వం తీసుకున్న అనాలోచితం నిర్ణయాల వల్ల నష్టం జరుగుతుందన్నారు.. మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.. రేషన్ వాహనాల్లో డ్రైవర్లు 70 నెలల కోసం గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు అని.. అర్ధాంతరంగా తొలగించడం ఎంతవరకు సమంజసం అన్నారు. గత ప్రభుత్వం లో బియ్యం అక్రమ రవాణా జరిగిందని అనవసర విమర్శలు చేయడం మంచిది కాదన్నారు అంబటి రాంబాబు… సీఎం చంద్రబాబు రేషన్ వాహన దారులను సంఘ విద్రోహ శక్తులుగా చూడడం ఏంటి అని ఆవేదన వ్యక్తం చేశారు అంబటి.. కూటమిలో ఎమ్మెల్యేలు బియ్యం అక్రమ రవాణాలో ఉన్నారని.. నాదెండ్ల మనోహర్ మొదటి స్మగ్లర్ అంటూ ఆరోపణలు చేశారు అంబటి రాంబాబు.. మొత్తానికి రేషన్ వ్యవహారం టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధాన్ని పెంచింది.. ఇప్పటికే రేషన్ వాహన దారులు ఇబ్బంది పడుతున్నారు.. మరి రేషన్ దుకాణాలలో మళ్లీ రేషన్ ఇవ్వడం వల్ల ప్రజలకు ఎంత వరకు మేలు జరుగుతుందో చూడాలి మరి.
