AP DSC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన నారా లోకేష్.. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడంటే..!
- డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన నారా లోకేష్
- ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ పండుగలాంటి వార్తను నారా లోకేష్ ప్రకటించారు.
అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. మార్చిలో ప్రక్రియ ప్రారంభించి విద్యాసంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ పూర్తి చేస్తామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, నవ్యాంధ్రలోనూ 80 శాతంపైగా టీచర్ల నియామకం చేసింది టీడీపీ ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ప్రజాస్వామ్య స్వేచ్ఛ కల్పిస్తున్నామని.. ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయ సేకరణ ఉంటోందని పేర్కొన్నారు.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ఇది కూడా చదవండి: New Rules: కేంద్ర బడ్జెట్ వేళ.. రేపటి నుంచి మారనున్న రూల్స్ ఇవే!
విద్యా వ్యవస్థ అంటే అనాలోచిత నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ కాదని నిరూపిస్తున్నామని చెప్పారు. అందుకోసమే ప్రతీ శుక్రవారం ఉపాధ్యాయుల సమస్యలపై కమిషనర్ అందుబాటులో ఉంటున్నారని.. అంతేకాకుండా తాను కలుస్తున్నట్లు చెప్పారు. టీచర్ల బదిలీ పారదర్శకంగా ఉండేందుకు ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. విద్యా వ్యవస్థలో భాగస్వామ్యులైన వారందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటూ ప్రజాస్వామ్య విలువలు చాటుతున్నట్లు నారా లోకేష్ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Strange Taxes: కేరళలో మహిళలు రొమ్ములను కవర్ చేయడంపై పన్ను.. ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!