Site icon NTV Telugu

Thalliki Vandanam Scheme: శుభవార్త.. ఖాతాల్లో తల్లికి వందనం సొమ్ము..!

Thalliki Vandanam Scheme

Thalliki Vandanam Scheme

Thalliki Vandanam Scheme: తల్లికి వందనం పథకంపై శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీలో తల్లికి వందనం పథకం పెండింగ్ దరఖాస్తులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆమోదం తెలిపారు.. విద్యా శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన లోకేష్.. పథకానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న రూ.325 కోట్లు రిలీజ్ కు అనుమతి ఇచ్చారు.. దీంతో, త్వరలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకానికి సంబంధించిన సొమ్ము జమకానుంది.. మరోవైపు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్..

Read Also: KGF Actor Death : విషాదం.. కేజీఎఫ్‌ నటుడు కన్నుమూత

కాగా, ఏపీలోని కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద.. 1వ క్లాస్‌ నుంచి 12వ తరగతి (ఇంటర్‌) వరకు విద్యార్థుల తల్లులకు ఆర్థిక చేయూత అందిస్తోంది.. విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బు జమ చేస్తున్న విషయం విదితమే.. ఒక్కో విద్యార్థికి ఈ పథకం కింద రూ.15 వేలు కేటాయిస్తున్న ప్రభుత్వం.. అందులో రూ. 13 వేలు తల్లుల ఖాతాల్లో జమ చేసి.. మిగిలిన రూ. 2 వేలు పాఠశాల నిర్వహణ గ్రాంట్ కోసం కలెక్టర్ల బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది.. దీంతో, ప్రతి విద్యార్థి తల్లికి రూ. 13 వేలు అందుతాయి. అంటే, ఇద్దరు పిల్లలున్న తల్లులకు రూ. 26 వేలు, ముగ్గురు పిల్లలున్న తల్లులకు రూ.39 వేలు.. ఇక, నలుగురు పిల్లలున్న తల్లులకు రూ. 52 వేలు.. వారి ఖాతాల్లో జమ చేసింది.. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన సొమ్ము విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అయ్యింది.. కానీ, కొన్ని కారణాల వల్ల, మరికొన్ని పెండింగ్‌లో పడ్డాయి.. అయితే, తల్లికి వందనం పథకం పెండింగ్ దరఖాస్తులకు మంత్రి నారా లోకేష్ ఆమోదం తెలిపారు.. విద్యా శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన లోకేష్.. పథకానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న రూ.325 కోట్లు రిలీజ్ కు అనుమతి ఇచ్చారు.. దీంతో, త్వరలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకానికి సంబంధించిన సొమ్ము త్వరలోనే జమ కానుంది.

Exit mobile version