Mopidevi Venkataramana: రాజీనామాపై మోపిదేవి సంచలన వ్యాఖ్యలు.. అందుకే వైసీపీకి గుడ్‌బై..
- వైసీపీకి రాజీనామాపై ఎంపీ మోపిదేవి వెంకటరమణ సంచలన వ్యాఖ్యలు..
- రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయిందని.. అధికారం లేదని పార్టీ వీడటం లేదు..
- ప్రత్యేక పరిస్థితుల్లో వైసీపీని వీడుతున్నా..
- నాకు ఉన్న ఇబ్బందులు.. సమస్యలతో వైసీపీని వీడాలని నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mopidevi Venkataramana: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాజీనామాకు ముందు ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయ.. రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయిందని.. అధికారం లేదని పార్టీ వీడటం లేదు అని స్పష్టం చేశారు.. అయితే, ప్రత్యేక పరిస్థితుల్లో.. నాకు ఉన్న ఇబ్బందులు, సమస్యలతో వైఎస్ఆర్సీపీ వీడాలని నిర్ణయం తీసుకున్నాను అన్నారు.. ఒక పార్టీలో పదవి పొంది మరో పార్టీలో చేరడం సరికాదు.. కాబట్టి రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. గత ఎన్నికల సమయంలో నాకు టికెట్ నిరాకరించడంతో మనస్తాపం చెందాను.. అప్పుడే ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also: Second Marriage: భార్య మంచి మనసు.. దగ్గరుండి భర్తకు మరో యువతితో పెళ్లి..
Also Read
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
- NTR Bharosa Pension: వారికి గుడ్ న్యూస్.. పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..
నేను తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదు. చాలా రోజులుగా అసంతృప్తితో ఉన్నాను అన్నారు మోపిదేవి.. కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇచ్చినా ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్న ఆయన.. ఇప్పటికి ఓటమిపై సమీక్ష జరగలేదు.. భవిష్యత్తులో లోటుపాట్లపై సమీక్ష చేసుకుంటారనుకుంటున్నాను అన్నారు. అయితే, నాకు రాజ్యసభకు రావడం ఇష్టం లేదు.. నిత్యం ప్రజల్లో ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను అని స్పష్టం చేశారు.. పార్టీని వీడొద్దు.. పార్టీలోనే ఉండాలని వైసీపీ పెద్దలు నాతో మాట్లాడారు.. నా సమస్యలు వారికి చెప్పాను అన్నారు. ఇక, నేను చేరే పార్టీలో ముందు నుంచి ఉన్న కొందరు నేతలు, కార్యకర్తలతో స్థానికంగా సమస్యలు వస్తాయి. అది సహజం.. సమన్వయంతో ముందుకు వెళ్తాను అన్నారు. నా నిర్ణయాన్ని ఎక్కువ మంది స్వాగతిస్తున్నారు. నా సన్నిహితులు, శ్రేయోభిలాషులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాను అని వెల్లడించారు. నేను, నాతో పాటు బీద మస్తాన్ రావు ఈరోజు రాజీనామా చేస్తున్నాం.. టీడీపీలో పార్టీ పెద్దలతో మాట్లాడాను.. త్వరలో టీడీపీలో చేరతాం అని ప్రకటించారు మోపిదేవి వెంకటరమణ..
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!