NTV Telugu Site icon

YSRCP: వైసీపీకి వరుస షాక్‌లు.. రాజీనామా లేఖలు రెడీ..! ఇద్దరు రాజ్యసభ సభ్యుల గుడ్‌బై..

Ysrcp

Ysrcp

YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. ఇప్పుడు ఇద్దరు రాజ్యసభ సభ్యులు.. తమ పదవులతో పాటు.. పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారు.. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌ రావు.. ఈ రోజు పార్టీకి, పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది.. తమ రాజీనామా లేఖలను సమర్పించేందుకు రాజ్యసభ చైర్మన్‌ అపాయింట్‌మెంట్ కోరారట ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు.. అయితే, మధ్యాహ్నం 12.30 గంటలకు ఆ ఇద్దరు ఎంపీలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు రాజ్యసభ ఛైర్మెన్.. దీంతో.. మధ్యాహ్నం రాజ్యసభ చైర్మన్ ను కలిసి తమ రాజీనామా లేఖలను ఎంపీలు మోపిదేవ, బీద మస్తాన్‌ రావు సమర్పిస్తారని తెలుస్తోంది.. ఇక, ఈ ఎంపీలతో పాటు.. మరికొందరు నేతలు కూడా వైసీపీని వీడేందుకు సిద్ధమైనట్టుగా ప్రచారం సాగుతోంది..

Read Also: Komatireddy Venkat Reddy: నల్గొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన..

ఇప్పటికే కొందరు మాజీ మంత్రులు పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తుండగా.. తాజాగా, పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా చేసిన విషయం విదితమే.. వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్న ఆమె.. రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ను పంపించారట.. త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది.. మరోవైపు.. రాజ్యసభ ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్ రావు ఈ రోజు రాజీనా చేయనున్నారు.. ఢిల్లీలో తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం.. రేపల్లె ప్రాంతంలో కార్యకర్తలతో సమావేశం పెట్టి.. భవిష్యత్‌ కార్యాచరణను మోపిదేవి ప్రకటిస్తారని సమాచారం..