Site icon NTV Telugu

Payyavula Keshav: రాజకీయ హత్యలపై దమ్ముంటే వివరాలు బయటపెట్టండి..!

Payyavula

Payyavula

Payyavula Keshav: రాజకీయ హత్యలపై దమ్ముంటే వివరాలు బయటపెట్టాలని.. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి సవాల్‌ విసిరారు మంత్రి పయ్యావుల కేశవ్.. జగన్ కు ప్రతిపక్ష హోదా రావాలంటే ఇంకో పదేళ్లయినా సమయం పడుతుందన్న ఆయన.. ప్రజలు జగన్‌కు ఓట్లేసి 11 సీట్లయినా ఇచ్చింది అసెంబ్లీకి వచ్చి చర్చించమని.. కానీ, సింగిల్ కెమెరాతో ప్రెస్మీట్లు పెట్టడానికి కాదు అన్నారు. అభిమానించినా అవమానించినా నిలదొక్కుకున్న వాళ్లే రాజకీయాల్లో ఉండగలరని జగన్ గ్రహించాలని సూచించారు.. జగన్ ఇలాగే పోతే ఉన్న 11 మంది కూడా ఒక్కరయ్యే ప్రమాదముందని గ్రహించాలన్నారు.. శ్వేతపత్రంలో చూపిన తొమ్మిదన్నర లక్షల కోట్ల అప్పు ఖచ్చితంగా పెరుగుతుందన్నారు.. ఇండియా కూటమి ప్రతినిధులతో రహస్య చర్చలు కోసం ఢిల్లీ వెళ్లానని ధైర్యంగా చెప్పొచ్చు కదా? అని నిలదీశారు. ప్రతిపక్ష పాత్ర నిర్వర్తించలేనని సభలో చేతులెత్తేసి కోర్టులో ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతారు అంటూ ఎద్దేవా చేశారు.. అసెంబ్లీలో అడగాల్సినవి ఢిల్లీ వెళ్లి అడుగాతానంటున్నాడు.. కనీసం 30 మంది ఎమ్మెల్సీలను మండలికైనా పంపితే వాస్తవాలు తెలుసుకునేవాళ్లు అని హితవుపలికారు.. రాష్ట్రంలో ఈ నిమిషం వరకూ జగన్ వేసిన పోలీసులే ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలుగా ఉన్న విషయం గ్రహించాలని.. రాజకీయ హత్యలపై దమ్ముంటే జగన్ వివరాలు బయటపెట్టాలని ఛాలెంజ్‌ చేశారు మంత్రి పయ్యావుల కేశవ్‌.

Read Also: Cabinet Sub Committee: 317 జీవోపై కేబినెట్ సబ్‌కమిటీ భేటీ.. విచారణ చేసి నివేదిక అందజేయాలని నిర్ణయం

Exit mobile version