Minister Parthasarathy: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. నామినేటెడ్ పదవుల్లో 34 శాతం బీసీ లకు కేటాయించేలా కేబినెట్ ఆమోదం తెలిపింది.. తల్లికి వందనం.. అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయడంపై మంత్రులు దృష్టి పెట్టాలన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు… నామినేటెడ్ పదవుల్లో 34 శాతం బీసీలకు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు.. నామినేటెడ్ పదవుల్లో గత ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన 50 శాతం పదవులు కేటాయింపులను రద్దు చేశారు… మహిళా పారిశ్రామిక వేత్తలు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. కొన్ని సబ్సిడీలు కూడా ఇవ్వనుంది ప్రభుత్వం.
Read Also: Fact Check : భారతీయులకు అమెరికా సంకెళ్లు వేసిందా? వైరల్ అవుతున్న ఫొటోల్లో నిజమెంత?
రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోందన్నారు మంత్రి పార్థసారథి.. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. 40 వేల కోట్లకు పైగా సౌర, పవన ఇంధన రంగంలో పెట్టుబడులు రానున్నాయి.. 19 వేల ఉద్యోగాల కల్పన కూడా జరగనుంది అన్నారు.. కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయన్నారు మంత్రి పార్థసారథి.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు… పోలవరం నిర్వాసిత కాలనీల్లో ఇళ్ల టెండర్ లను రద్దు చేసి కొత్తగా పిలిచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. నిర్వాసిత కాలనీల్లో అన్ని వసతులు ఉండేలా చర్యలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పోటు సూపర్ వైజర్ల నియామకానికి ఆమోదం తెలిపింది కేబినెట్.. సబ్ రిజస్ట్రార్ కార్యాలయాల్లో ప్రజల సౌకర్యం కోసం అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ కోసం డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.. చెన్నై – బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ లో కొందరు రైతులకు పరిహారం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాం.. మానవ వనరులను అభివృద్ధికి ఏపీ నాలెడ్జి సొసైటీ కెపాసిటి బిల్డింగ్ 2025కి ఆమోదం తెలిపింది.. ఏపీలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి పెద్దపీట వేసేలా సౌర పవన విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు..