Minister Nimmala Ramanaidu: కలలో కూడా వారికి రెడ్ బుక్ గుర్తుకు వస్తుంది.. ఎక్కడ ఎరుపు రంగు కనిపించినా..!
- వైఎస్ జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు ఘాటు వ్యాఖ్యలు..
- కక్ష్యలు.. కేసులు.. వేధింపులు.. హత్యలకు మారుపేరు జగన్ రెడ్డి అని విమర్శ..
- రెంటు కుటుంబాల మధ్య ఘర్షణను ప్రభుత్వానికి అంట గట్టాలని జగన్ రెడ్డి కుట్ర అని మండిపాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nimmala Ramanaidu: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలు.. ఆయన కామెంట్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. కక్ష్యలు, కేసులు, వేధింపులు, హత్యలకు మారుపేరు ‘‘జగన్ రెడ్డి’’గా పేర్కొన్న ఆయన.. రెంటు కుటుంబాల మధ్య ఘర్షణను ప్రభుత్వంపై అంట గట్టాలని జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు.. మా గెలుపు చూసి ఓర్వలేక తప్పుడు రాతలతో, తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మభ్యపెట్టాలని ఆలోచనలు చేస్తున్నారన్న ఆయన.. ఎక్కడ ఎరుపు రంగు కనిపించినా సరే జగన్ రెడ్డికి రెడ్ బుక్ కనిపిస్తుంది… అంతెందుకు ఆయనకు కలలో కూడా రెడ్ బుక్ గుర్తుకు వస్తుందని సెటైర్లు వేశారు.. దళిత బిడ్డ సుబ్రహ్మణ్యం అనే కారు డ్రైవర్‌ను అతి కిరాతకంగా హత్య చేసి కారులో డోర్ డెలివరి చేసినప్పుడు వైఎస్ జగన్ ఎందుకు పరామర్శకు వెళ్లలేదు? అని నిలదీశారు.. సొంత బాబాయి గొడ్డలి వేటు పడి చనిపోతే ఆయన కుమార్తె అయినా సునీత పక్షాన కాకుండా ముద్దాయిల పక్షాన ఎందుకు ఉన్నావు జగన్ రెడ్డి? అంటూ మండిపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు.. కాగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ హత్యలు జరుగుతున్నాయని వైఎస్ జగన్ ఆరోపిస్తోన్న విషయం విదితమే.. హత్యకు గురైన వారి కుటుంబాలను పరామర్శిస్తూ వస్తున్న ఆయన.. నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో అందరినీ బెదిరిస్తున్నారని వ్యాఖ్యానిస్తోన్న విషయం విదితమే..
Read Also: Tihar Prison jailer: తీహార్ జైలర్ ఓవరాక్షన్.. బర్త్ డే పార్టీలో తుపాకీతో డ్యాన్స్
Also Read
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
తాజావార్తలు
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!